Asianet News TeluguAsianet News Telugu

యువ దర్శకుడికి సూర్య బంపర్ అఫర్?

ఒకప్పుడు ఈ హీరో తెలుగులో కూడా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ అందుకున్న రికార్డులు ఉన్నాయి. సూర్యకి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ అతని గత చిత్రాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చెబుతాయి. సూర్య ఏ సినిమా చేసిన తమిళ్ తో  పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ కావాల్సిందే.

suriya another project on discussion
Author
Hyderabad, First Published Oct 30, 2019, 8:11 AM IST

తెలుగు తమిళ్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోల్లో సూర్య ఒకరు. ఒకప్పుడు ఈ హీరో తెలుగులో కూడా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ అందుకున్న రికార్డులు ఉన్నాయి. సూర్యకి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ అతని గత చిత్రాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చెబుతాయి. సూర్య ఏ సినిమా చేసిన తమిళ్ తో  పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ కావాల్సిందే.

చెప్పాలంటే ఇక్కడ స్టార్ హీరోల రేంజ్ లో సూర్య కొన్ని సార్లు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం సూర్య తెలుగులో కూడా ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కొత్త ప్లాన్ చేస్తున్నాడు. కుదిరితే డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనే ఆలోచిస్తున్నాడు. ఆ సంగతి అటుంచితే.. రీసెంట్ గా తమ్ముడికి ఖైదీ సినిమాతో హిట్టిచ్చిన లోకేష్ కనగరాజన్ తో కూడా సూర్య డిస్కస్ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం సూర్య సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ఆ తరువాత హరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఆ తరువాత లోకేష్ తో సినిమా చేయాలనీ సూర్య ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక ఆలోపు లోకేష్ విజయ్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే సూర్య కోసం ఆ తాను ఒక లైన్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఇటీవల సూర్య కెరీర్ అనుకున్నంతగా కొనసాగడం లేదు.

సూర్య తమిళ్ లో సక్సెస్ అందుకుంటున్నప్పటికీ తెలుగులో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. సింగం సిరీస్ ల అనంతరం సూర్య చేసిన సినిమాలు అంతగా క్లిక్కవ్వలేకపోయాయి. ఇక ఇటీవల వచ్చిన  NGK - బందోబస్త్ సినిమాలు దారుణంగా దెబ్బకొట్టాయి. ఈ రెండు సినిమాలతో సూర్య తెలుగు మార్కెట్ చాలా తగ్గిపోయిందని కామెంట్స్ వచ్చాయి.,  ఇక నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని టాలీవుడ్ నెగిటివ్ టాక్ పై సూర్య పగబట్టినట్లు తెలుస్తోంది.

మళ్ళీ తెలుగులో తన మార్కెట్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని స్ట్రాంగ్ గా ఫిక్సయిన సూర్య నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అలాగే ఇటీవల కొంత మంది తెలుగు రైటర్స్ తో సూర్య కొన్ని కథలపై డిస్కర్స్ చేసినట్లు సమాచారం. కుదిరితే త్వరలోనే డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు.మరి అతని ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios