Asianet News TeluguAsianet News Telugu

Maanadu:లీగల్ యాక్షన్ తీసుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ వార్నింగ్

‘మన్మధ’, ‘వల్లభ’ వంటి ప్రేమకథా చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు. ఆయన హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం ‘మానాడు’. 

Suresh Productions legal notice for Maanadu issue
Author
Hyderabad, First Published Jan 5, 2022, 4:10 PM IST


కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. ఆ మధ్యన థియేటర్లో రిలీజ్ అయినా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డుల వర్షం కురిపించింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటించింది. పొలిటికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ది లూప్ పేరుతో విడుదల చేద్దామనుకున్నారు కానీ కుదరలేదు.  అయితే తెలుగు వెర్షన్ ని డిసెంబర్ 24 న సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ చేసారు. అయితే ఈ సినిమా నిమిత్తం ఈ రోజు సురేష్ ప్రొడక్షన్ వారు పేపర్లో ప్రకటన ఇచ్చారు.

సినిమా రీమేక్ హక్కులు తమ దగ్గర ఉన్నాయని.. కథలో ఏ భాగమైనా కాపీ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ‘మానాడు’ సినిమాను కాపీ కొట్టి తెలుగులో ఓ సినిమా రూపొందిస్తున్నారని విషయం సురేష్ ప్రొడక్షన్స్ వరకు వెళ్లింది. అందుకే ‘మానాడు’ రీమేక్ రైట్స్ గురించి లీగల్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక  మరో ప్రక్క ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని.. దానికి సంబంధించిన హక్కులు గీతాఆర్ట్స్ చేతిలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో అల్లు సిరీస్ హీరోగా నటించే ఛాన్స్ ఉందన్నారు. అయితే నిజానికి ఈ సినిమా రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ తెలుగులో రీమేక్ చేయబోతుంది. 

https://www.youtube.com/watch?v=ng82AdciU48

కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేయలేకపోయారు. కానీ ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ మాత్రం సోనీ లివ్ లో ఉంది. ‘మానాడు’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ లివ్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పటికే చాలా మంది తెలుగు డబ్బింగ్ తో సినిమాను చూసేసారు.   ‘టైమ్‌ లూప్‌’ అనే కాన్సెప్ట్‌ను తీసుకుని తికమక లేకుండా ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్‌ చేసేలా ‘మానాడు’ను తీర్చిదిద్దడంలో దర్శకుడు వెంకట్ ప్రభు సఫలమయ్యారు.  అబ్దుల్‌ ఖాలిక్‌ పాత్రలో శింబు అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత ఆయన ఖాతాలో మంచి హిట్ పడింది. తెరపై పూర్తి ఎనర్జీతో కనిపించాడు. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర డీసీపీ ధనుష్కోటి. ఎస్‌జే సూర్య ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన పలికే సంభాషణలు, హావభావాలు మెప్పిస్తాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios