మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ నటనలో మంచి మార్కులు వేయించుకున్నాడు. ఆ మధ్యన వరుస ప్లాపులతో కాస్త ఇబ్బంది పడ్డప్పటికీ ఇటీవల రెండు వరుస హిట్ల్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇదిలా ఉండగా మెగా కాంపౌండ్ లో చరణ్, బన్నీ లాంటి హీరోలంతా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. 

ప్రస్తుతం తేజు వయసు 33 ఏళ్ళు. ఇటీవల నితిన్, నిఖిల్ లాంటి హీరోలంతా పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయిపోయారు. దీనితో ఇంట్లో నుంచి తేజు పై కూడా క్రమంగా ఒత్తిడి పెరుగుతోందట. 

బ్రా లెస్ గా మంటలురేపుతున్న బ్రూనా అబ్దుల్లా.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్

పెళ్లి చేసుకోమని ఇంట్లో కుటుంబ సభ్యులు గొడవపెడుతున్నట్లు సాయిధరమ్ తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. వాళ్ళ తొందర చూస్తుంటే ఈ ఏడాదే నా పెళ్లి జరిగేటట్లు ఉంది అని తేజు వ్యాఖ్యానించడం విశేషం. 

తాను చేసుకోబోయేది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది క్లారిటీ లేదని తేజు తెలిపాడు. భవిషత్తులో ప్రేమలో పడితే ప్రేమ వివాహమే చేసుకుంటానని తెలిపాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.