జయభేరీ సంస్థ అధినేత, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హెచ్ఎండీఏ నిబంధనలు అతిక్రమించిన కేసులో ఆయనకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది 

హెచ్ఎండీఏ నిబంధనలు అతిక్రమించిన కేసులో జయభేరీ సంస్థ అధినేత, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నగరానికి చెందిన మధుసూదన్ అనే వ్యాపారవేత్త కొండాపూర్‌లో జయభేరీ సంస్ధ నుంచి ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఈ ఫ్లాట్ విషయంలో జయభేరీ సంస్థ అనేక అవకతవకలకు పాల్పడిందని సుప్రీంకోర్టును ఆశ్రయించారు మధుసూదన్. ఈ కేసులో కొనుగోలుదారుడికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పు చెప్పింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred