సూపర్ స్టార్ రజని సినిమా అంటే అభిమానులు పూనకంతో ఊగిపోతారు. దేశవ్యాప్తంగా రజనీకాంత్ ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ ఏడాది రజనీకాంత్ పేట చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న దర్బార్ మూవీ సంక్రాంతికి విడుదుల కాబోతోంది. 

ఆ మధ్యన విడుదలైన ఫస్ట్ లుక్ కు ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో రజని అదరగొట్టేశారు. తాజాగా దర్బార్ చిత్ర యూనిట్ సూపర్ స్టార్ పవర్ ఫుల్ లుక్ రివీల్ చేసేలా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. కత్తి చేతబట్టి శత్రువులని చీల్చి చెండాడుతున్న పోలీస్ అధికారిగా రజని కనిపిస్తున్నాడు. 

ఈ పోస్టర్ తో రజని అభిమానులు పండగా చేసుకోవడం గ్యారెంటీ. అప్పుడప్పుడూ సినిమా లొకేషన్స్ నుంచి లీకవుతున్న రజని ఫోటోలు ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తునప్పటికీ.. డైరెక్టర్ మురుగదాస్ మాత్రం ఆ అంశాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. 

రజనీకాంత్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుభాస్కరన్ లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కత్తి పట్టిన రజని అదిరిపోయే స్టైల్ లో ఉన్న మోషన్ పోస్టర్ పై ఓ లుక్కేయండి.