ఎంతో మంది సినీ నటులకు ప్రేరణగా నిలిచిన సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. ఒక బస్ కండక్టర్ నుంచి ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగిన రజిని జీవితంలో సంతోషాలతో పాటు కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాల్ని కూడా చూశారు. ఇటీవల ఆయన తన జీవితంలో ఎన్నటికీ మరచిపోలేని ఒక ఘటన గురించి చెప్పుకొచ్చారు.

రజినీకాంత్ మాట్లాడుతూ.. నా సినీ కెరీర్ లో మొదట నాలుగు సినిమాల్లో నటించి కొంచెం గుర్తింపు తెచ్చుకున్నప్పుడు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో ఒక నిర్మాత ఒక పాత్ర చేయమని చెప్పి 6 వేలు రెమ్యునరేషన్ ఇస్తామని అన్నారు. ముందు అడ్వాన్స్ గా వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంటికి ఆలస్యంగా కారు పంపించారు. ఏవియం స్టూడియో వద్ద షూటింగ్ స్పాట్ కి వెళ్ళగానే ప్రొడక్షన్ మేనేజర్ కలిసి డబ్బు అడిగితే ఇవ్వలేదు.

మేకప్ వేసుకోగానే ఇస్తామని అన్నారు.  అలాగేనని వెయిట్ చేశాను. మేకప్ వేసుకున్న తరువాత కూడా నా మాట ఎవరు లెక్క చేయలేదు. అప్పుడు ఒక కాస్ట్లీ కారు నుంచి దిగిన ఒక నిర్మాత నా దగ్గరకు సీరియస్ గా వచ్చారు. ఏంటి? అడ్వాన్స్ డబ్బు ఇవ్వకుంటే నటించానని చెప్పావట! నువ్వేమైనా గొప్ప నటుడిని అనుకుంటున్నావా? అని కోపంగా మాట్లాడారు. అనంతరం వేషం లేదు బయటకి పో అని అన్నారు.  నేను కనీసం కారులో అయినా దింపెయండి అన్నాను.

అందుకు వారు ఒప్పుకోలేదు. అప్పుడే అనుకున్నాను. ఎలాగైనా ఒక పెద్ద హీరో అవ్వాలని. తరువాత కొన్ని రోజులకు అదే ఎవియం స్టూడియోకి ట్టి ఇటాలియ‌న్ మోడ‌ల్ కారులో  వెళ్ళాను. నాలుగున్నర లక్షలు పెట్టి ఆ కారును కొన్నాను. రాబిన్ స‌న్ అనే ఆంగ్లో ఇండియ‌న్‌ని కారు డ్రైవ‌ర్‌గా పెట్టుకుని అదే స్టూడియో ముందు స్టైల్ గా దిగాను. డైరెక్ట్ గా మా గురువుగారు కే.బాలచందర్ గారి ఆశీర్వాదం తీసుకున్నాను అని రజినీకాంత్ మాట్లాడారు. అయితే ఆ నిర్మాత ఎవరనేది మాత్రం సూపర్ స్టార్ బయటపెట్టలేదు.