వయసు పెరుగుతున్న కొద్దీ సుపర్ స్టార్ రజినీకాంత్ ఎనర్జి కూడా అదే స్పీడ్ లో వెళుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రజినీకాంత్ ఏడు పదుల వయసు దాటినప్పటికి ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు. ముఖ్యంగా కబాలి నుంచి తలైవా వరుసగా సినిమాలతో బిజీ అవుతున్నాడు. జయపజయలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నారు.

దర్బార్ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కమల్ హసన్ ప్రొడక్షన్ లో ఖైదీ, మాస్టర్ ఫేమ్ లోకేష్ డైరెక్షన్ లో ఒక సినిమాను మొదలు పెట్టనున్నారు. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరొక సినిమాను మొదలుపెట్టాలని తలైవా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

టాలెంటెడ్ టెక్నీషియన్ రాఘవ లారెన్స్ రజినీకాంత్ 170వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లారెన్స్ కాంచన సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయ్యింది. ఆ ప్రాజెక్ట్ అనంతరం లారెన్స్ రజినీకాంత్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలోనే రజిని లారెన్స్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. ఇక మళ్ళీ చాలా రోజుల తరువాత ఈ కాంబినేషన్ పై వస్తున్న వార్తలకు అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఆ వార్తలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.