వయసు పెరుగుతున్న కొద్దీ ఎవరైనా సరే చేసే పనులు చాలా వరకు తగ్గిస్తారు. విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం నేటి తరానికి ధీటుగా వేగాన్ని పెంచుతున్నారు. ఏడు పదుల వయసు దగ్గరపడుతున్న కొద్దీ అలుపులేకుండా బ్యాక్ టూబ్యాక్ సినిమాలను ఒకే చేస్తున్నారు.

ఇప్పటికే దర్బార్ సినిమాముని ఫినిష్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే పదికి పైగా కథలను విన్న తలైవా యాక్షన్ డైరెక్టర్ శివతో స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డిసెంబర్ ఎండింగ్ లోనే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే ఇంకా ఆ ప్రాజెక్ట్ మొదలుకాకముందే మరో దర్శకుడు చెప్పిన కథను విన్నట్లు తెలుస్తోంది.

అతనెవరో కాదు.. డిఫరెంట్ సినిమాలతో రియాలిటీ ఎమోషన్ ని కలిగించే గౌతమ్ మీనన్. ఈ దర్శకుడితోనే సూపర్ స్టార్ 169వ సినిమా చేయనున్నాడు అని కోలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. వచ్చే డిసెంబర్ 12కి తలైవా 69వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. శివ సినిమా షూటింగ్ అయిపోవడానికి మినిమమ్ 6నెలలైనా పడుతుంది.  

వచ్చే సమ్మర్ అనంతరం గౌతమ్ మీనన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి తలైవా ఎలక్షన్స్ కి సిద్ధమవ్వాలని అనుకుంటున్నాడు. మరి ఆయన ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. ఇక మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్బార్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆ సినిమా తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది.