కన్నడ సినిమా ఇండస్ట్రీ క్రేజ్ ని మరీంత పెంచిన పాన్ ఇండియన్ మూవీ KGF ఛాప్టర్ 1. సినిమా కోసం దర్శకుడితో పాటు ఇతర టెక్నీషియన్స్ ఎంతగా కష్టపడ్డారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే సినిమాలో కనిపించిన నటీనటులు కూడా వారి టాలెంట్ తో సినిమా స్థాయిని పెంచారు. యష్ తో పాటు ప్రతి ఒక్క నటుడు సినిమాలో హైలెట్ అయ్యాడని చెప్పవచ్చు.

ఇక KGF సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు చిత్ర యూనిట్ నిన్న క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 23న రిలీజ్ కానున్నట్లు అఫీషియాల్ గా మోషన్ పోస్టర్ తో చెప్పేశారు. ఇకపోతే అదే తేదికి రజినీకాంత్ సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ ప్రస్తుతం శివ డైరెక్షన్ లో 'అన్నాతై' అనే సినిమా చేస్తున్నాడు.  ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ మసాల యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కుతున్న ఆ సినిమా కూడా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కాబోతోంది.

KGF సినిమాను పెద్ద సినిమాలు లేని సమయంలో రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ మొదటి నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు అనుకోని విధంగా తలైవా సినిమా నుంచి పోటీ వస్తుండడంతో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే రెండు సినిమాల కలెక్షన్స్ పై ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుంది. మరి ఈ క్లాష్ పై ఒక క్లారిటీ రావాలంటే రజినీకాంత్ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.