ఇండియన్ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్బార్ షూటింగ్ ని స్పీడ్ గా పూర్తి చేసిన తలైవా అదే స్పీడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అందుకుంటున్నాడు. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా సినిమా 150కోట్లను దాటేసింది.

140కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన దర్బార్ తమిళనాడులో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన తెలుగు కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. 3కోట్లకు అమ్ముడైన ఈ సినిమా షేర్స్ 3.5కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. కానీ మిగతా ఏరియాల్లో ఇంకా దర్బార్ ప్రాఫిట్ జోన్ లోకి రాలేదు. అయితే సినిమాకు మొదట్లో ఓపెనింగ్స్ గట్టిగానే వచ్చాయి.

కానీ మహేష్ - అల్లు అర్జున్ వంటి లోకల్ హీరోలు భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసి అత్యధిక లొకేషన్స్ లో సినిమాలని రిలీజ్ చేస్తుండడంతో దర్బార్ పై ఎఫెక్ట్ పడింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 14కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు టాక్. ఈ వీకెండ్ అనంతరం సినిమా ఎంతవరకు లాభాలని అందిస్తుంది అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

 ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో... నయనతార హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్‌ విడుదల చేసారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం విడుదల అయ్యింది. రజనీ కుమార్తెగా నివేదా థామస్.. ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు.