ఇక మిగిలింది మహేష్ ఒక్కడేనా.. చేయాల్సిందే అంటున్న ఫ్యాన్స్ !ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్నా పాన్ ఇండియా అనే మాట వినిపిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమాకు పాన్ ఇండియా స్థాయి లభించింది. 

ప్రస్తుతం సూపర్ స్టార్ అభిమానుల్లో కొత్త కోరిక పుట్టుకొచ్చింది. మహేష్ కూడా త్వరలో పాన్ ఇండియా మూవీ చేయాల్సిందే అని అభిమానులు కోరుతున్నారు. బాహుబలితో ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. డిజాస్టర్ టాక్ వచ్చిన సాహో చిత్రం బాలీవుడ్ లో వసూళ్లు అదరగొట్టిందంటే అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న క్రేజ్. 

కరోనా ఎఫెక్ట్: భర్తతో శ్రీయ.. వైరల్ అవుతున్న చిలిపి వీడియో

ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విరూపాక్ష చిత్రం పాన్ ఇండియా మూవీనే అనే ప్రచారం జరుగుతోంది. 

అంటే స్టార్ హీరోల జాబితాలో ఇక మిగిలింది మహేష్ ఒక్కడే. దీనితో త్వరలోనే మహేష్ ఓ పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేసుకుంటే బావుంటుందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మహేష్ జేమ్స్ బాండ్ తరహా కథలో నటించాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అలాంటి  మంచి మార్కెట్ ఉంటుంది. మరి మహేష్ ఆలోచన ఎలా ఉందో..