కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా విలవిలలాడుతుంది. గతంలో ప్రపంచం ఎన్నడూ చూడని ఈ విపత్తు నుంచి బయటపడేందుకు మానవాళి పోరాడుతోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు సెలబ్రిటీలు కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ రంగం నుంచి టాప్‌ హీరోలందరూ తమ అభిమానుల్లో అవేర్‌నేస్‌ కలిగించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సూపర్‌ స్టార్ మహేష్ బాబు వరుస ట్వీట్లు చేశాడు.

ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సదర్భంగా మరోసారి అభిమానులకు సూచనలు చేశాడు మహేష్. ఈ ఆపత్‌కాలంలో ప్రతీ ఒక్కరు ధైర్యంగా ఉండాలన్నాడు మహేష్. భయకరమైన ఈ మహహ్మారితో అందరూ ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చాడు. అదే సమయంలో ఫేక్‌ న్యూస్‌ లవిషయంలో అప్రమత్తంగా ఉండాలని అభిమానులకు సూచించాడు.

 సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మరో సినిమా ను ఇంత వరకు ప్రకటించని మహేష్ ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. తన పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తూ.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులకు కొన్ని సూచనలు చేశాడు. రెండు వారాలుగా కొనసాగుతున్న లాక్‌ డౌన్‌లో మనం ఎంతో దృడంగా ఉన్నాం. మన ప్రభుత్వాలు ప్రజారోగ్యం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఈ పోరాటంలో ముందుడిం పోరాడుతున్న అందరికీ కృతజ్ఞతలు అంటూ కామెంట్ చేశాడు మహేష్.