సాధారణంగా ఒక జనరేషన్‌లో రిలీజ్‌ అయిన సినిమాను తరువాత జనరేషన్‌ ఆడియన్స్ పెద్దగా ఇష్టపడరు. క్షణ క్షణానికి మారుతున్న ఆడియన్స్‌ అభిరుచి క్యాచ్ చేయలేక దర్శక నిర్మాతలు తంటాలు పడుతుంటే దాదాపు రెండు దశాబ్దాల క్రితం రిలీజ్‌ అయిన ఓ సినిమాను  ఇప్పుడు రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. టాలీవుడ్‌ యంగ్ హీరో నితిన్ హీరోగా పరిచయం అయిన సినిమా జయం. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేశారు. తమిళ్‌లో ఈ సినిమా ఎంత విజయం సాధించిందంటే ఈ సినిమా హీరో రవి పేరు జయం రవిగా మారిపోయింది. అయితే అప్పట్లో ఎన్ని రికార్డులు సాధించినా ఈ జనరేషన్‌ ప్రేక్షకులను ఈ సినిమా ఎంత వరకు అలరిస్తుంది అన్నది డౌటే.

ఈ 18 ఏళ్లలో సినిమా కథా కథనాలతో పాటు, సినిమా మేకింగ్‌లోనూ చాలా మార్పులు వచ్చాయి. మరి ఈ సమయంలో కన్నడ దర్శక నిర్మాతలు జయం సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారట. కన్నడ నాట ప్రవీణ్‌ కుమార్‌ అనే డాక్టర్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే తన తొలి చిత్రంగా ఓ ప్రేమకథలో నటించాలని భావించి జయం సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ప్రవీణ్‌. ప్రస్తుతం చర్చల దశలో  ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.