దేశవ్యాప్తంగా తన స్టైల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడు లేని విధంగా సినీ కెరీర్ లో స్పీడ్ పెంచుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో సూపర్ స్టార్ స్పీడ్ హాట్ టాపిక్ గా మారింది. ఏడు పదుల వయసు దగ్గరపడుతున్నా కూడా తలైవా ఏ మాత్రం తగ్గడం లేదు. యువ హీరోల కంటే వేగంగా త్వరత్వరగా సినిమా షూటింగ్ లను పూర్తి చేస్తున్నాడు.

ఇటీవల దర్బార్ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసిన రజినీకాంత్ వెంటనే శివ చెప్పిన మారో మాస్ కథను ఎనౌన్స్ చేశాడు. అయితే దర్బార్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుండగా ఆ తరువాత శివ ప్రాజెక్ట్ ని 2020 దీపావళికి రిలీజ్ చేయాలనీ రజినీకాంత్ ప్లాన్ చేసుకుంటున్నారు. రెండు సినిమాలపై కూడా ఆడియెన్స్ లో అంచనాల డోస్ గట్టిగానే ఉంటుందని చెప్పవచ్చు.

దర్బార్ సినిమా మురగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. 2020 పొంగల్ కానుకగా తెలుగు తమిళ్ లో ఒకేసారి దర్బార్ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇక శివ దర్శకత్వంలో చేయనున్న మరో మాస్ కథను వీలైనంత త్వరగా మొదలుపెట్టి అదే జోష్ తో వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రజిని టార్గెట్ సెట్ చేసుకున్నారు.