సన్నీ లియోన్ పొలిటికల్ టచ్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా?.. ఆమె రాజకీయాల్లోకి వస్తే ఇంకేమైనా ఉందా?.. ఇక ఆ సంగతి అటుంచితే అమ్మడి పాలిటికల్ టచ్ సినిమాలో ఉండబోతోందట. ప్రతిసారి గ్లామర్ లుక్ లో ఐటెమ్ సాంగ్స్ చేసి బోర్ కొట్డడంతో ఇప్పుడు కాస్త డిఫరెంట్ రోల్స్ ను సెలెక్ట్ చేసుకుంటోంది. 

ఇప్పటికే హిస్టారికల్ ఫిల్మ్ వీరమాదేవి సినిమాలో అమ్మడు నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సన్నీ నెక్స్ట్ ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే సినిమాలో నటిస్తున్నట్లు గత కొంత కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే తమిళనాడు లోని ఒక నిజమైన పొలిటికల్ లేడి జీవితం ఆధారంగా ఆ సినిమా కథ ఉంటుందట. 

లీడ్ రోల్ లో నటించడానికి దాదాపు సన్నీ రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా ఒప్పుకుందని సమాచారం. ప్రస్తుతం నటిస్తోన్న వీరమాదేవి సినిమా దర్శకుడు వడి వుడయానే ఆ పొలిటికల్ మూవీని కూడా తెరకెక్కిస్తాడని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు వీరమాదేవి సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా అయిపోగానే మారో ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.