ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ క్యాంపస్‌లోని హాస్టళ్లపై ఆదివారం దుండగులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌పై వర్సిటీలో ముసుగులు ధరించిన దుండుగులు విచ్చలవిడిగా దాడిచేసి పలువురువిద్యార్ధులు, ఉపాధ్యాయులను తీవ్రంగా గాయపరిచారు.

ఈ హింసపై పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో దీపిక పదుకోన్ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండించి.. వారికి మద్దతుగా నిలుస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు విద్యార్ధులకు సపోర్ట్ చేస్తున్నారు.

మహేష్ బాబుకి జగన్ ఆఫర్..!

తాజాగా బాలీవుడ్ నటి సన్నీలియోన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. గురువారం నాడు ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. అతి పెద్ద సమస్యపై తను మాట్లాడుతున్నానని. హింసని ఎప్పుడూ సమర్ధించలేనని చెప్పింది.

దాడుల వలన బాధితురాలు మాత్రమే కాదు.. వారి కుటుంబం కూడా తీవ్ర క్షోభని అనుభవించాల్సి ఉంటుందని .. ఇది వారి అభిప్రాయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. హింసకి చోటులేకుండా సమస్య పరిష్కారం కనుగొనాలని అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సామరస్యపూర్వకంగా విభేదాలు పరిష్కరించుకోవాలని అన్నారు.