ఈ సినిమాలో సునీల్ 'మంగళం శ్రీను' అనే పాత్రలో నటించాడు. ఇటీవలే ఆయన పాత్ర పేరును పరిచయం చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హెయిర్ స్టైల్ .. మీసకట్టు .. లుక్స్ పరంగా ఆయన ఆకట్టుకున్నాడు.  

అల్లు అర్జున్ - రష్మిక జంటగా రూపొందిన చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ‘మంగళం శ్రీను’గా “పుష్ప” సినిమాలో నటించిన సునీల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సునీల్ ఏమన్నాడు?

 సునీల్ మాట్లాడుతూ..ఈ నెల 17వ తేదీన “పుష్ప” రిలీజ్ అవుతోంది, 18వ తేదీ నుండి ఇంటికి తాళం వేసి, సుకుమార్ ఇంట్లో లేడని బయట ఇద్దరు మనుషులు పెట్టి చెప్పించండి… అంటూ సుకుమార్ సతీమణి గారికి సలహా ఇచ్చారు సునీల్. ఓ రెండు సెకన్లు గ్యాప్ ఇచ్చి, ‘కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పండి’ అంటూ ముగించారు సునీల్. అయితే ఈ వ్యాఖ్యలలో కాస్త డబుల్ మీనింగ్ అనిపించడంతో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. కొందరు యాంటి ఫ్యాన్స్ సునీల్ ఏంటి రిలీజ్ కు ముందే అంత మాట అనేశారేంటి? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

సునీల్ కంటిన్యూ చేస్తూ.. నన్ను చూస్తే మీ అందరికి భయం వేస్తుంది, అనసూయను చూస్తే సినిమాలో నాకు భయమేస్తుంది. ఒక్క తెలుగులోనే నేను విలన్ గా చేద్దామనుకున్నా, కానీ ఈ టీమ్ పుణ్యమా అంటూ టోటల్ ఇండియాకే విలన్ అయిపోతున్నాను, దీనికి సుకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సినిమాలో సునీల్ 'మంగళం శ్రీను' అనే పాత్రలో నటించాడు. ఇటీవలే ఆయన పాత్ర పేరును పరిచయం చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హెయిర్ స్టైల్ .. మీసకట్టు .. లుక్స్ పరంగా ఆయన ఆకట్టుకున్నాడు. ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత, చిత్తూరు యాసతో కూడిన ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనుందనే విషయం అర్థమైంది.

ఇటీవల డబ్బింగ్ చెప్పడానికి వెళ్లిన బన్నీ, తనకంటే ముందుగానే సునీల్ డబ్బింగ్ చెప్పేసిన సీన్స్ ను చూశాడట. సునీల్ నటన మామూలుగా లేదు .. అదరగొట్టేశాడని సుకుమార్ తో చెప్పాడట. సునీల్ పాత్ర అంత బాగా వస్తుందనీ .. అంత బాగా చేస్తాడనని తాను ఎంతమాత్రం ఊహించలేదంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడని చెప్పుకుంటున్నారు.