టాలీవుడ్ బెస్ట్ కమెడియన్ గా కొన్నేళ్ల వరకు ఒక వెలుగు వెలిగిన సునీల్ ఆ తరువాత హీరోగా కూడా కొన్ని సినిమాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హీరోగా వరుస అపజయాలు రావడంతో మళ్ళీ కమెడియన్ గా అడుగులు వేస్తున్నాడు. అలాగే తనలోని మరొక షెడ్ ని బయటపెట్టేందుకు సునీల్ ప్రయత్నం చేస్తున్నాడు.

'కలర్ ఫోటో. సినిమా ద్వారా సునీల్ విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా అతి భయంకరమైన ప్రతి నాయకుడిగా తెరపై బయపెడతాడట. నేడు సునీల్ పుట్టినరోజు సందర్బంగా 'కలర్ ఫోటో' చిత్ర యూనిట్ ఒక స్పెషల్ లుక్ ని రిలీజ్ చేసింది. రామరాజు అనే పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడు. సీరియస్ లుక్ తో జీప్ పై కూర్చున్న సునీల్ కొత్త యాంగిల్ లో అద్భుతంగా కనిపిస్తున్నాడు. మరీ సినిమా ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

హృదయ కాలేయం - కొబ్బరి మట్ట వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సాయి రాజేష్ కలర్ ఫొటో సినిమాని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి టీజర్ ని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. అమృత ప్రొడక్షన్స్ - లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పై సాయి రాజేష్ - బన్నీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.