టైమ్ బాగున్నప్పుడు,మన హవా నడుస్తున్నప్పుడు అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో అది ప్రత్యక్ష్యంగా కనపడుతూంటుంది. ఎప్పుడైతే మన సినిమాలు ఆడటం లేదో, మనకిచ్చే గౌరవం తగ్గిపోతుంది. మనకిచ్చే రెమ్యునేషన్ లో కోతలు పడిపోతాయి. చివరకు ఆఫీస్ బోయ్ కూడా ...అలాగే చూద్దాం అంటాడు ..ఏదైనా అడిగితే...అందుకే స్టార్ డమ్ కోసం నిరంతరం సినిమావాళ్లు తపించిపోతూంటారు. కానీ అందుకు అవకాశాలు, టైమ్, మనం ఎంచుకునే కథలు కలిసిరావాలి. కలిసి రాకపోతే కాలక్షేపానికి కూడా కబుర్లు చెప్పే వాడు ఉండడు. పూలరంగండు లాంటి సునీల్ జీవితం అందుకు ఉదాహరణ.

మోదీ దెబ్బకి ఇరుక్కున్న నాగబాబు.. సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు..!

మర్యాదరామన్న,పూలరంగడు, అందాలరాముడు సినిమాలతో స్టార్ గా ఎదిగిన కమిడియన్ సునీల్...ఆ తర్వాత గుర్తు కూడా పెట్టుకోలేని సినిమాలు చేసాడు. అవి ఎంత స్పీడుగా వచ్చాయో అంత స్పీడుగా థియోటర్ నుంచి వెళ్ళిపోయాయి. దానితో పాటే ఆ వైభవం కూడా ముగిసిపోయింది. అదే వేరే వాడు అయితే మొత్తం సినీ కెరీరే ముగిసిపోయేది. కానీ మంచి టాలెంట్ ఉన్నవాడు,పరిచయాలు ఉన్నవాడు కావటంతో సునీల్ కు క్యారక్టర్స్ వస్తున్నాయి. సునీల్ తో జర్నీ చేసిన దర్శకులు, నటులు ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగని వాళ్లెవరూ హీరోగా సునీల్ ని పెట్టి చేయలేరు కదా.

అయితే త్రివిక్రమ్ వంటివాడు పూనుకున్నా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ కాలేకపోయాడు. రీసెంట్ గా చేసిన రవితేజ `డిస్కోరాజా`తో విల‌న్ అవ‌తారం ఎత్తాడు సునీల్. ఆ  సినిమా డిజాస్టర్ అయినా త‌న‌ పాత్ర‌కు మంచి స్పంద‌న రావ‌డంతో దాన్నే కంటిన్యూ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇక్కడే పడింది ట్విస్ట్.  కమిడియన్ నుంచి హీరోగా టర్న్ అయ్యాక ఒకటి నుంచి రెండున్నర కోట్లు దాకా రెమ్యునేషన్  తీసుకున్న సునీల్  ఇప్పుడు అందులో పావు వంతు కూడా కోట్ చెయ్యలేకపోతున్నాడు.

తన ప్రారంభ రోజుల్లోకి వెళ్ళి...ఒక్కో సినిమాకు రోజుల లెక్క‌న రెమ్యున‌రేష‌న్ తీసుకోవాల్సిన పరిస్తితి వచ్చింది. రోజుకు మహా అయితే రెండు నుంచి మూడు లక్షలు దాకా ఛార్జ్ చేస్తున్నాడంటున్నారు. ఫుల్ డే కే ఈ పేమెంట్. హాఫ్ డే అంటే అందులో సగం ఎగిరిపోతుంది. ప్ర‌స్తుతం `క‌ల‌ర్ ఫొటో`లో విల‌న్‌గా న‌టిస్తున్నాడు సునీల్.