సినిమావాళ్లకు బోలెడు సెంటిమెంట్స్ ఉంటాయి. ఓసారి ఓ  కాంబినేషన్ లో హిట్ కొడితే మరో సారి అదే ట్రై చేస్తూంటారు. అవి దాదాపు సక్సెస్ అవుతూంటాయి కూడా. ఇప్పుడు సందీప్ కిషన్ అలాంటి ప్రయత్నమే చేయబోతున్నారు. సందీప్ కిష‌న్ పుట్టిన‌రోజు (మే 7) సందర్భంగా.. నిర్మాత జెమిని కిర‌ణ్ త‌న ప్ర‌తిష్టాత్మ‌క బ్యాన‌ర్ ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్‌పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్: 15గా సందీప్ కిష‌న్‌తో ఒక చిత్రాన్ని ప్ర‌క‌టించారు. 

సందీప్ కిష‌న్‌తో ఈ బ్యాన‌ర్‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. ఇదివ‌ర‌కు ‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్’‌, ‘బీరువా’ వంటి స‌క్సెస్‌ఫుల్ సినిమాలు ఈ కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి. రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్న ఈ చిత్రానికి భాను బోగ‌వ‌ర‌పు క‌థ అందిస్తున్నారు. ఈ చిత్రం బ్యూటిఫుల్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నుందని చెబుతున్నారు.

 ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి.  'నిను వీడని నీడను నేనే' తర్వాత సందీప్‌ కిషన్‌ చేస్తున్న సినిమా ఇది. న్యూ ఏజ్‌ స్పోర్ట్స్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న  చిత్రానికి డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. హిప్‌ హాప్‌ తమిళ బాణీలు సమకూరుస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం పూర్త‌యిన వెంట‌నే ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ నిర్మించే చిత్రంలో సందీప్ న‌టించ‌నున్నాడు.