వరస ఫ్లాపులతో దూసుకుపోయిన యంగ్ హీరో సందీప్ కిషన్  'నిను వీడని నీడను నేనే' చిత్రం సక్సెస్ తో కాస్త కుదటపడ్డాడు. ఈ సినిమాను స్వయంగా నిర్మించడంతో మొదటి ప్రయత్నంలోనే నిర్మాతగా కూడా హిట్ దక్కింది. దాంతో అదే ఊపుని కంటిన్యూ చేస్తూ మరో సినిమా మొదలెట్టారు. 'A1 ఎక్స్ ప్రెస్' టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రకథకు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నారు.

చాలా ఉత్సాహంగా మొదలెట్టిన ఈ చిత్రం షూటింగ్ లో సమస్యలు మొదలయ్యాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రం అఫీషియల్ గా తమిళంలో వచ్చిన Natpe Thunai కు రీమేక్. తమిళంలో ఉన్న స్దాయిలో తెలుగులో సీన్స్ ని దర్శకుడు తీయలేకపోతున్నారని హీరోతో పాటు టీమ్ భావిస్తోందట.

మేడమ్ సర్... మేడమ్ అంతే... చీరలో సింగర్ సునీత అందాలు!

దాంతో కీలక సీన్స్ సమయంలో షూటింగ్ ఆపేసి...ఒరిజినల్ గా తమిళంలో డైరక్ట్ చేసిన దర్శకుడుని రప్పించి డైరక్ట్ చేయించాలనే నిర్ణయంలో ఉన్నాడట. ఈ విషయం దర్సకుడు  డెన్నిస్ జీవన్ కు మింగుడుపడటం లేదుట. తనను ప్రక్కన పెట్టి వేరే దర్శకుడుతో ప్లాన్ చేయటంతో ఏం చేయాలనే డైలమోలో ఉన్నాడట. దానికి తోడు అతనికి ఇదే తొలి సినిమా. షార్ట్స్ ఫిల్మ్స్ తీయటంతో,అవి చూసి  నచ్చి ఈ సినిమా ని పిలిచి ఇచ్చారు.

అయితే సినిమాలో ఆటకు సంభందించిన సీన్స్ తీయటంలో అతని అనుభవం సరిపోవటం లేదని చెప్తున్నారు. ఇది దర్శకుడు కెరీర్ కు సంబందించిన ప్రశ్న. అదే సమయంలో సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా డబ్బులు కూడా పోతాయి. దాంతో సందీప్ కిషన్ ఆచి,తూచి అడుగులు వేయాలని అనుకుంటున్నాడట.

హాకీ నేపథ్యంలో తెరకెక్కే మొదటి తెలుగు సినిమా ఇదేనని అంటున్నారు.  టైటిల్ లోగో సైతం రిలీజ్ చేసారు. డెన్నిస్ జీవన్ కనుకొలను ఈ సినిమాకు దర్శకుడు.  డెన్నిస్ జీవన్ కు గతంలో షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకత్వం వహించారు.    పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. అభిషేక్ ఆగర్వాల్ ఆర్ట్స్.. వెంకటాద్రి టాకీస్ బ్యానర్లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.