Asianet News TeluguAsianet News Telugu

‘క‌ప‌ట‌ధారి’నే నమ్ముకున్నాడు.. కాపాడతాడా?

సుమంత్ వచ్చింది తెలుగులో పెద్ద ఫ్యామిలీగా పేరొందిన అక్కినేని కుటుంబంనుంచే అయినా, తన తాతగారి అక్కినేని పోలికలు ఉన్నా కలిసిరాలేదు. కెరీర్ పరంగా మొదట నుంచీ ఎదురుదెబ్బలే తింటున్నాడు.

sumanth new movie title is kapatadhari
Author
Hyderabad, First Published Nov 19, 2019, 7:19 AM IST

సుమంత్ వచ్చింది తెలుగులో పెద్ద ఫ్యామిలీగా పేరొందిన అక్కినేని కుటుంబంనుంచే అయినా, తన తాతగారి అక్కినేని పోలికలు ఉన్నా కలిసిరాలేదు. కెరీర్ పరంగా మొదట నుంచీ ఎదురుదెబ్బలే తింటున్నాడు. ఎప్పుడో ప్రారంభం రోజుల్లో వచ్చిన సత్యం తర్వాత సరైన హిట్ లేదు. రీసెంట్ గా ‘సుబ్రహ్మణ్యపురం’, ‘ఇదంజ‌గ‌త్‌’ చిత్రాల‌ు చేసిన  సుమంత్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘క‌ప‌ట‌ధారి’. ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా.

క‌న్నడంలో వచ్చిన ‘ ‘క‌ప‌ట‌ధారి’’ సినిమాకు ఇది తెలుగు రీమేక్‌.  ఈ చిత్రాన్ని కన్నడలో నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ నిర్మించారు. అక్కడ ఈ సినిమా సైలెంట్ హిట్ గా నమోదైంది. చిన్న బడ్జెట్ లో పెద్ద విజయం సాధించింది. దాంతో ఈ సినిమాపై సుమంత్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాని మొదట రాజశేఖర్ తో అనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దాంతో సుమంత్ ని వెతుక్కుంటూ ఈ సినిమా వచ్చింది.

ఈ చిత్రానికి సంబంధించి టైటిల్‌, పాత్రలను పరిచయం చేస్తున్న మోషన్ పోస్టర్  వీడియోను స్టార్ హీరో , సుమంత్ మేనమామ అయిన నాగార్జున విడుదల చేశారు. డా.ధనుంజయన్‌ తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమంత్‌ సరసన నందిత శ్వేత, పూజాకుమార్‌ నటిస్తున్నారు. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్‌ ఆంటోనీతో ‘భేతాళుడు’ తెరకెక్కించి విజయాన్ని అందుకొన్న ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.

మార్చిలో రిలీజ్ చేస్తామని చిత్రం టీమ్ ఇది వరకే ప్రకటించాయి. నాజర్‌, జయప్రకాష్‌, సంపత్‌ తదితరులు నటిస్తున్నారు.
క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. తెలుగు వెర్షన్‌లో సుమంత్‌, నాజ‌ర్‌, నందిత‌, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌ప్రకాశ్‌, సంప‌త్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిమన్‌ కే కింగ్, డైలాగ్స్‌: బాషా శ్రీ. 

 

Follow Us:
Download App:
  • android
  • ios