సైరా చిత్ర విడుదల కావడంతో మెగాస్టార్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలకు రెడీ అవుతున్నాడు. పరాజయం ఎరుగని కొరటాల శివ చిరంజీవి 152వ చిత్రాన్ని డైరెక్ట్ చేసాయబోతున్నారు. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 

అదే సమయంలో చిరంజీవి 153వ చిత్రం గురించి కూడా చర్చ మొదలైంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ చిరు 153వ చిత్తాని డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ రాంచరణ్ కు రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ అందించారు. రంగస్థలం చిత్రంలో సుకుమార్ ప్రతిభ చిరంజీవిని మెప్పించింది. 

ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో ఓ చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నారు. చిరంజీవి, సుకుమార్ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథతో సుక్క, చిరు రాబోతున్నట్లు వినికిడి.