టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన రైటింగ్, మేకింగ్ టాలెంట్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇప్పుడు ఆయన కూతురు సుకృతి తన సింగింగ్ టాలెంట్ తో షాకిస్తోంది. జనవరి 11న సుకుమార్ 50వ పుట్టినరోజు వేడుకులు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా సుకుమార్ కుమార్తె సుకృతి ఆయన కోసం ఓ పాట పాడి తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అయితే నేడు సుకృతి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ట్విట్టర్ వేదికగా సుకృతి పాడిన పాట వీడియోను పోస్ట్ చేశారు.

రష్మికకి అన్ని కోట్ల ఆస్తులా..? అంతా షాక్

'డార్లింగ్ డైరెక్టర్ సుకుమార్ ముద్దుల కుమార్తె సుకృతికి పుట్టినరోజు శుభాకాంక్షలు. తండ్రి పుట్టినరోజు కోసం తాను పాడిన పాటని.. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను' అని దేవిశ్రీ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

సుకృతి పాట విన్న నెటిజన్లు ఆమె టాలెంట్ ని పొగుడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తన వాయిస్ అధ్బుతంగా ఉందని పొగుడుతున్నారు. ప్రస్తుతం సుకుమార్.. అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.