స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకోవడమే కాదు.. బాహుబలి తర్వాత అంతటి పెద్ద విజయాన్ని తన పేరిట నమోదు చేసుకున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులని అలరించింది. 

ప్రస్తుతం అల్లు అర్జున్.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో నటిస్తున్నాడు. రంగస్థలం చిత్రంతో చరిత్ర సృష్టించిన సుకుమార్.. వైవిధ్య భరితమైన చిత్రాలు తెరకెక్కించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో తెరకెక్కించే చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు. ఏ చిత్రానికి దేవిశ్రీ సంగీత దర్శకుడు. సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ సంగీత దర్శకుడిగా తప్పనిసరి. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ ఫామ్ సరిగా లేదు. మునుపటిలా దేవిశ్రీ సంగీతానికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రావడం లేదు.

బ్లాక్ డ్రెస్ లో నమిత వయ్యారాలు చూశారా.. ఫొటోస్ వైరల్ 

దీనితో సుకుమార్ ఈ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ ని తప్పించి.. తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అల వైకుంఠపురములో చిత్రానికి తమన్ కెరీర్ బెస్ట్ మ్యూజిక్ అందించాడు. దేవిశ్రీ ప్రసాద్ ని తప్పించినట్లు వస్తున్న వార్తలపై దర్శకుడు సుకుమార్ మండిపడ్డారు. అసలు అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. తమన్ గురించి డిస్కషనే జరగలేదు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించబోతున్నారని అన్నారు. మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.