బుల్లితెరపై గ్లామర్ షో చేస్తూ యాంకర్ గా దూసుకుపోతుంది అనసూయ. 'జబర్దస్త్' షోతో అనసూయకి వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్ గానే కాకుండా నటిగా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో 'క్షణం', 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సినిమాలు ఆమెకి గుర్తింపుని తీసుకొచ్చాయి.

ఇక రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది అనసూయ. 'రంగస్థలం' తరువాత అనసూయకి ఆ స్థాయిలో మరో పాత్ర దక్కలేదు. ఇప్పుడు మరోసారి దర్శకుడు సుకుమారే.. అనసూయ కోసం ఓ పాత్రని సిద్ధం చేస్తున్నాడు.

మళ్లీ సెక్సీగా తయారైన ఇలియానా... క్లీవేజ్ షోతో చంపేస్తోంది

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ఓ సినిమాని రూపొందించనున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అనసూయని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమా అనసూయ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనుందని టాక్.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. గతంలో 'క్షణం' సినిమాలో అనసూయ నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించింది. ఇప్పుడు మరోసారి తన విలనిజాన్ని పండించనుంది.

అల వైకుంఠపురములో సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్‌ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.