'జబర్దస్త్', 'ఢీ' వంటి టీవీ షోల ద్వారా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమవుతున్నారు. 

ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ మాస్టర్ విడుదల చేశారు.

ట్రైలర్ లో తనదైన పంచ్ డైలాగులు, డాన్స్ తో ఆకట్టుకున్నాడు సుధీర్. యాక్షన్ సీన్స్ లో కూడా కనిపించాడు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నారు. ''ఫోటోలు పంపిస్తాను వాట్సాప్‌లో ఉన్నావా అని అడిగితే.. లేదంకుల్‌ అమీర్‌పేటలో ఉన్నాను'' అంటూ సుధీర్ చెప్పే డైలాగ్ నవ్విస్తుంది. 

ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ పాటలో నటించారు. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే, డా. ఎన్‌. శివప్రసాద్‌, పృథ్వీ, సంజయ్‌ స్వరూప్‌, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.