Asianet News TeluguAsianet News Telugu

నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన హీరో సుధీర్ బాబు.. ఇంట్రెస్టింగ్ గా టైటిల్, అదిరిపోయేలా ఫస్ట్ లుక్

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) వరుస సినిమాలతో జోరు పెంచుతున్నాడు. ఈరోజు సుధీర్ పుట్టిన రోజు సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. టైటిల్, ఫస్ట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.
 

Sudheer Babu Announced the next project with Interesting title, creepy first look release
Author
Hyderabad, First Published May 11, 2022, 1:37 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీయేస్ట్ హీరోగా మారిపోయాడు. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అదే జోష్ లో వరుసగా తన అప్ కమింగ్ ఫిల్మ్స్ ను అనౌన్స్ చేస్తున్నారు సుధీర్ బాబు. తాజాగా తన 41వ పుట్టిన రోజు సందర్భంగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రకటించారు.   

తన నెక్ట్స్ ప్రాజెక్ట్ బైలింగ్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి  ‘మామా మశ్చీంద్ర’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు  చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, రైటర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియయాల్సి ఉంది.

మూవీ నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ లో సుధీర్ బాబు చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారు.. స్టాండింగ్ మైక్ పట్టుకుని క్రేజీ సాంగ్ పాడుతూ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను చాలా కలర్ ఫుల్ గా ఉండటం సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందనే భావనను కల్పిస్తోంది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తోంది. అయితే సుధీర్ ను ఈ చిత్రంతో ‘నైట్రో’ స్టార్ గా పరిచయం చేయడం విశేషం. 

ఇప్పటికే సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో సుధీర్ సరసన యంగ్ హీరోయిన్  కృతి శెట్టి (Kriti Shetty) ఆడిపాడనుంది. మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు  యాక్షన్ ఫిల్మ్ గా భవ్య క్రియేషన్స్ పతాకంపై హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సుధీర్ 16’ Sudheer 16 కూడా తెరకెక్కుతోంది. మహేష్‌ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios