విక్రాంత్‌ రోణ..ఇదొక యాక్షన్‌ ఎమోషనల్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ కథా చిత్రమని తొలి నుంచి చిత్ర టీమ్  చెప్పుకుంటూ వచ్చింది. ట్రైలర్‌, టీజర్‌లో కూడా ఆ విధంగానే చూపించింది. పైగా పాన్‌ ఇండియా మూవీ అనగానే.. కేజీయఫ్‌ తర్వాత కన్నడ నుంచి మరో భారీ మూవీ రాబోతుందని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు.


కన్నడ సూపర్‌స్టార్‌ కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన భారీ యాక్షన్‌ ఎమోషనల్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ కథా చిత్రం విక్రాంత్‌ రోణ. అనూప్‌ భండారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గ్లామర్‌ స్టార్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ గెస్ట్ రోల్ లో నటించారు. ఇప్పటికే విడుదలైన సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ విషయం బయిటకు వచ్చింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జీ స్టూడియోస్ వారు ఈ సినిమా ప్రొడక్షన్ లో పార్టనర్ గా ఉన్నారు. అంటే జీ 5 కు ఈ చిత్రం ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ ఉన్నాయన్నమాట. 4-6 వారాల్లో ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

నిజానికి రిలీజ్ కు ముందే ఫ్యాన్సీ డీల్ ఆఫ‌ర్ చేశార‌ట ఓటీటీ సంస్దలు వారు. డైరక్ట్ ఓటిటికు ఇమ్మని. కానీ ‘విక్రాంత్ రోణ‌’ మేక‌ర్స్ వారి ఆఫ‌ర్‌ను సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. ఈ విష‌యంపై ‘విక్రాంత్ రోణ‌’నిర్మాత జాక్ మంజునాథ్ అడిగితే ఆయన స్పందిస్తూ.. ‘‘నిజమే! మా ‘విక్రాంత్ రోణ‌’ చిత్రానికి ఓటీటీ సంస్థ నుంచి ఫ్యాన్సీ ఆఫ‌ర్ వ‌చ్చింది. ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయాలి. ముఖ్యంగా కొన్ని స‌న్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌, చిన్న పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకుని త్రీడీలో ప్ర‌త్యేకంగా రూపొందించాం. క‌చ్చితంగా త్రీడీ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ప్రేక్ష‌కుల‌ను స‌రికొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు. 

దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ ‘‘నిజానికి మా సినిమాను చూసి ఓటీటీ సంస్థ అంత పెద్ద ఫ్యాన్సీ ఆఫర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విష‌యం. అయితే ప్రేక్ష‌కుకుల ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌డానిక‌నే త్రీడీలో ‘విక్రాంత్ రోణ‌’ను రూపొందిస్తున్నాం. సినిమా బిగ్ స్క్రీప్‌పై చూస్తే వ‌చ్చే ఫీలింగ్ మ‌రో రేంజ్‌లో ఉంటుంద‌ని చెప్ప‌గ‌లం. కాబ‌ట్టి మేం కూడా అలాగే భావిస్తున్నాం’’ అన్నారు.

విక్రాంత్‌ రోణ..ఇదొక యాక్షన్‌ ఎమోషనల్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ కథా చిత్రమని తొలి నుంచి చిత్ర టీమ్ చెప్పుకుంటూ వచ్చింది. ట్రైలర్‌, టీజర్‌లో కూడా ఆ విధంగానే చూపించింది. పైగా పాన్‌ ఇండియా మూవీ అనగానే.. కేజీయఫ్‌ తర్వాత కన్నడ నుంచి మరో భారీ మూవీ రాబోతుందని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇది కూడా కేజీయఫ్‌ రేంజ్‌లో ఉంటుందని ఊహించారు. కానీ దర్శకుడు అనూప్‌ భండారి యాక్షన్ పరంగా ఆ స్దాయిలో నిరాశపరిచాడు. కానీ తెరపై విజువల్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ అద్భుతంగా ఉండటంలో ఈ సినిమా చాలా మందికి నచ్చుతోంది.