చిరంజీవి అసలు పేరు వేరు ..స్క్రీన్ పేరు వేరు. అయితే స్క్రీన్ పేరు ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. ఈ విషయమై ఆయన గతంలో దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం క్లారిటీ ఇచ్చారు. అలాగే రావుగోపాలరావు, చిరంజీవి చాలా సినిమాల్లో కలిసి పనిచేసారు. రావుగోపాలరావు గారు చిరంజీవికు ఓ బిరుదు ఇచ్చారు....అదేమిటి...ఆ ముచ్చట్లు మీకోసం.. చిరంజీవి మాటల్లోనే...

"నా అసలు పేరు శివ శంకర వర ప్రసాద్ అన్న సంగతి అందరికీ తెలుసు. నేను చిత్రసీమలోకి ప్రవేశించక ముందు నాకో సారి కల వచ్చింది ఆ కలలో ఓ చిన్న దేవాలయం. అక్కడ ఒక చిన్న అమ్మాయి నన్ను చిరంజీవి అని పిలిచింది. నన్ను కాదేమోననుకున్నాను.

నిన్నేనయ్యా చిరంజీవీ అంది మళ్లీ.
నాపేరు చిరంజీవి కాదుగా అంటూనే వెళ్లాను.
తర్వాత ఇంకవెరో కూడా అలాగే పిలిచినట్లైంది. అంతే...
ఉదయం లేవగానే మా అమ్మగారితో విషయం చెప్పాను. ఆమె కూడా ఆశ్చర్యపోయారు. పోనీ ఎందుకొచ్చిందో ఏమిటో...ఆ పేరే పెట్టుకో అన్నారు. నాకూ అలాగే అనిపించింది. పైగా నా ఇష్టదైవం హనుమంతుడు. ఆయన చిరంజీవి. అలా కూడా ఈ పేరు కలిసి వచ్చిందని చిరంజీవిగా పేరు మార్చుకున్నాడు అని చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చారు.

బిరుదు విషయానికి వస్తే..

అలాగే చిరంజీవి గారికు రావుగోపాలరావుగురు ఇచ్చిన బిరుదు కళా కార్మికుడు. ఈ బిరుదుని చిరంజీవిగారు పదిలంగా దాచుకున్నా అని చెప్పారు.  కళా కార్మికుడు..రావుగోపాలరావు గారు సరదాగా ఇచ్చింది, సాయింత్రం ఆరుగంటల వరకే షూటింగ్ లో పాల్గొనే వాళ్లను కళాకారులు అని, రాత్రి ఎన్ని గంటలైనా షూటింగ్ లో ఉండేవాళ్లను కళా కార్మికులు అని రావుగోపాలరావుగారు సరదాగా అనేవారు. ఆ బిరుదును తాను పద్మశ్రీలాగ కాపాడుకుంటూ వస్తున్నాను అనేవారు చిరంజీవి. కొంచెం వయస్సు దాటాక కళాకారుడుని అవుతాను అనేవారు.

చిరంజీవి ఊరు: మొగల్తూరు
చదువు: బికాం, డిఎఫ్ ఎ (డిప్లమా ఇన్ ఫిలిం యాక్టింగ్)
వివాహం: అల్లూరి రామలింగయ్య గారి కుమార్తెతో
తేదీ:  20, ఫిభ్రవరి 1980
స్దలం: రాజేశ్వరీ కళ్యాణమండపం, చెన్నై
సినిమాల్లో తొలి సంపాదన: వెయ్యినూట పదహార్లు, మనవూరి పాండవులు చిత్రం కోసం నిర్మాత జయకృష్ణ ఇచ్చారు.
మొట్టమొదటి పూల మాల: ఆ చిత్రం శతదినోత్సవంలో మెడలో వేసిందే
ఎక్కువగా నటించిన హీరోయిన్: రాధిక, పద్దెనిమిది చిత్రాల్లో
ఎక్కువగా డైరక్ట్ చేసిన దర్శకుడు: ఎ కోదండరామిరెడ్డి

(విజయ చిత్ర సినీ మాస పత్రికలో ప్రచురితం)