కోలీవుడ్ లో మరో స్టార్ కమెడియన్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. గతకొంత కాలంగా అతని పెళ్లిపై వస్తున్న రూమర్స్ కి ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. అతనెవరో కాదు. తెలుగు కమెడియన్ వెన్నలకిషోర్ మాదిరిగా తమిళ్ లో మంచి క్రేజ్ అందుకుంటున్న యువ కమెడియన్ సతీష్ ముత్తు కృష్ణన్.

 

ఈ తమిళ్ యాక్టర్ గడిచిన 5 ఏళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించాడు. ఏడాదికిపది సినిమాలు చేసుకుంటూ బిజీబిజీగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా శివకార్తికేయన్ సినిమాల్లో హైలెట్ గా నిలుస్తూ బెస్ట్ కామెడీ కాంబినేషన్ గుర్తింపు తెచ్సుకున్నాడు. అయితే మొత్తానికి ఈ యువ నటుడు ఒక ఇండివాడయ్యాడు. సిక్సర్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు 'చాచి' చెల్లిని పెళ్లి చేసుకున్నాడు.

గత కొన్నాళ్లుగా సతీష్ - సింధు మధ్య ప్రేమ కొనసాగుతున్నట్లు తమిళ్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.  ఇక మొత్తానికి బుధవారం సింపుల్ గా నిచ్చితార్ధ వేడుకను ముగించుకొని పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ లో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. గ్రాండ్ గా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సతీష్ 15కి పైగా సినిమాలతో బిజీగా ఉన్నాడు.