సినిమా ఇండస్ట్రీలను కరోనా వైరస్ చాలానే కలవరపెడుతోంది. మొన్నటివరకు షూటింగ్ పనులతో హడావుడిగా కనిపించిన చిత్రపరిశ్రమలోని సుడియోలు, సినిమా హాళ్లు ఇప్పుడు నిర్మానుష ప్రాంతాలుగా దర్శనమిస్తున్నాయి. కరోనా దెబ్బకు అవుట్ డోర్ షెడ్యూల్స్ ని కూడా ఛాలా వరకు క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక టాలీవుడ్ నిర్మాతల మండలి ఇటీవల షూటింగ్ లు కూడా కొన్ని రోజుల పాటు ఆపెయ్యల్సిందిగా తీర్మానించింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల ఇస్మార్ట్ హీరోయిన్ నాభా నటేష్ సినీ పెద్దలు రిలీజ్ చేసిన ప్రకటనకు తగ్గట్టు షూటింగ్ కి దూరమవ్వగా పెద్ద నిర్మాతల్లో ఒకరైన బెల్లంకొండ సురేష్ ఆమెని ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ  నిర్మిస్తున్న కొత్త సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ - నాభా నటేష్ జంటగా నటిస్తున్నారు.  సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు 'అల్లుడు అదుర్స్' అనే టైటిల్ ని సెట్ చేశారు.

అయితే నిర్మతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా యధావిధిగా బెల్లకొండ సినిమా షూటింగ్ ని కొనసాగించాలని చెప్పారట. అదే విధంగా హీరోయిన్ నాభా నటేష్ ని వెంటనే బెంగళూర్ నుంచి హైదరాబాద్ రావాలని నిర్మాత సీరియస్ అయినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. వీలైనంత త్వరగా షూటింగ్ పనులను పూర్తి చేయాలనీ చిత్ర యూనిట్  పెట్టుకున్నట్లు టాక్.