Asianet News TeluguAsianet News Telugu

బాలయ్యకు 'నో' చెప్పిన స్టార్ హీరోయిన్

ఓ వయస్సు వచ్చే సరికి..హీరోలకు కొత్త సమస్యలు ఎదురౌతూంటాయి. హీరోగా పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు సిద్దంగా ఉన్నా, ప్రక్కన చేయటానికి హీరోయిన్స్ కొరత ఏర్పడుతుంది. ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ...యంగ్ హీరోల వెనక పడుతూంటారు. 

Star heroine Tamanna rejects Balakrishna
Author
Hyderabad, First Published Jan 5, 2020, 5:06 PM IST

ఓ వయస్సు వచ్చే సరికి..హీరోలకు కొత్త సమస్యలు ఎదురౌతూంటాయి. హీరోగా పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు సిద్దంగా ఉన్నా, ప్రక్కన చేయటానికి హీరోయిన్స్ కొరత ఏర్పడుతుంది. ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ...యంగ్ హీరోల వెనక పడుతూంటారు. సీనియర్ హీరోయిన్స్ కు క్రేజ్ ఉండదు. అలాగని మరీ కొత్త హీరోయిన్స్ తెద్దామంటే వాళ్లు మరీ చిన్న పిల్లల్లా కనపడుతూంటారు. దాంతో ఉన్నంతలో స్టార్ హీరోయిన్స్ ని పట్టుకుని వాళ్లతో గేమ్ ఆడటానికి రెడీ అవుతూంటారు. వాళ్లకు కావాల్సిన రెమ్యునేషన్ ఇచ్చి ప్రాజెక్టు సెట్ చేస్తూంటారు. అయితే ఒక్కోసారి ఆ పరిస్దితి కూడా ఉండదు. ఇప్పుడు బాలయ్యది అదే సిట్యువేషన్ అంటున్నారు. ఆయన తాజా చిత్రానికి ఓ స్టార్ హీరోయిన్ ని అడిగితే ఆమె మొహమాటం లేకండా నో చెప్పేసిందిట. ఇంతకీ ఎవరామె..

బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన  'రూలర్' డిసెంబర్ 20 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షోకే తేడా టాక్ వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా థియేటర్ కు వెళ్ళిన అభిమానులను పూర్తి స్దాయిలో నిరాశపరిచింది. వారి అంచనాలను కొంచెం కూడా అందుకో లేకపోయింది.  రివ్యూలు.. మౌత్ టాక్ అంతా నెగెటివ్ గా ఉండడం తో సినిమా కలెక్షన్స్ రెండో రోజు నుంచి దారుణం గా పడి పోవటం మొదలైంది. ఈ నేపధ్యంలో బాలయ్య నెక్ట్స్ సినిమాపైనే అందరి దృష్టీ పడింది. బోయపాటి దర్శకత్వంలో రెడీ అవనున్న ఈ చిత్రం ప్రారంభమైంది.

‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ను బాలయ్య చెప్తూ తన కొత్త సినిమాని రీసెంట్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే.‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలతో సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌గా పేరుపొందిన బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్‌ చిత్రం మొదలైంది. NBK106గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినమాలో హీరోయిన్ గా తమన్నా ని అడిగినట్లు సమాచారం. అయితే ఆమె బడ్జెట్ చూసి మినిమం 15 కోట్లు కూడా లేదని, అలాగే బాలయ్య వరస ఫెయిల్యూర్స్ లో ఉన్నాడని అర్దం చేసుకున్న ఆమె నో చెప్పిందంటున్నారు. అయితే తను ఓ హిందీ సినిమా కమిటవ్వుతున్నాని చెప్పి తెలివిగా తప్పించుకుందిట. అప్పటికీ నిర్మాత భారీగానే ఆఫర్ చేసినా ఒప్పుకోలేదట.
 
ఇప్పటికే బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలు వచ్చాయి. ఈ రెండూ మంచి విజయం సాధించాయి. దీంతో బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌ సూపర్‌హిట్‌ అనే మార్క్‌ ఏర్పడింది. ఈ మేరకు మరో హిట్‌ కొట్టాలని బోయపాటి స్క్రిప్టును సిద్ధం చేసారట. ఇంట్రస్టింగ్ కథను రెడీ చేసారని చెప్తున్నారు. ఈ సినిమా ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో హిట్ కొడితే బోయపాటి-బాలయ్య హ్యాట్రిక్‌ కొట్టినట్లే. మరి వీరి కాంబినేషన్ లో వచ్చే ఈ కొత్త సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios