సౌత్‌ నార్త్‌ అన్న తేడా లేకుండా కరోనా భయంతో అన్ని ఇండస్ట్రీలు మూత పడ్డాయి. సినిమా షూటింగ్ లతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ఆగిపోయాయి. దీంతో తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు బిజీ బిజీగా ఉండే స్టార్స్ ఇంట్లో ఉండే సరికి రకరకాల వ్యాపకాలతో వీడియోలు చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ పూజా హెగ్డే కూడా ఓ ఇంట్రస్టింగ్ ఫోటో ను పోస్ట్ చేసింది.


ప్రజెంట్‌ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది ముంబై బ్యూటీ పూజా హెగ్డే. సౌత్‌ తో పాటు బాలీవుడ్‌ లోనూ బిజీగా ఉన్న ఈ భామ ఒక దశలో రెండు షిఫ్ట్‌ ల చొప్పున పని చేసింది. కానీ ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌ తో పూజా కూడా ఇంట్లోనే ఉంటుంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఆసక్తికర ఫోటో ను పోస్ట్ చేసింది. తాను ఏదో తింటున్న ఫోటోను పోస్ట్ చేసింది పూజా. సోషల్ డిస్టాన్సింగ్, క్వారెంటైన్‌ సందర్భంగా ఇంటికే పరిమితమైన పూజా హెగ్డే తెగ తినేస్తుందట. దీంతో ఆమె లావైపోతానేమో అని భయపడుతుంది.


అదే విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది పూజా. `నేను ఈ క్వారెంటైన్‌ పూర్తయ్యే సరికి లావుగా తయారై బయటకు వస్తానేమో.. కానీ ఈ కార్బ్‌ వల్ల వచ్చే గ్లో మాత్రం సూపర్బ్` అంటూ కామెంట్ చేసింది పూజా. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్‌ హీరోగా జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో పాటు బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్ సినిమాలో నటిస్తోంది పూజా. వీటితో పాటు పలు బాలీవుడ్ చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.