టాలీవుడ్ జేజమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనుష్క నెక్స్ట్ నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆడియెన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా స్వీటీ.. సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ గా కనిపించి మంచి కిక్ ఇచ్చింది.

ఇకపోతే ఆమె నిశ్శబ్దం సినిమా ఆడియెన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగిస్తోంది. ఫస్ట్ లుక్ తోనే ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఆడియెన్స్ నుంచి వస్తున్న డిమాండ్ కి అనుష్క నిశ్శబ్దం వీడి స్పందించక తప్పలేదు. సంక్రాంతి హాలిడేస్ అనంతరం ఆమె సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనుందట. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు ప్రస్తుతం హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పింది.

నిశ్శబ్దం సినిమా పనులు దాదాపు ఎండింగ్ కి వచ్చేశాయి. ఇక సినిమాని ఈ నెల 31న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ నిర్మాత కోన వెంకట్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక సినిమాకు సంబందించిన రెగ్యులర్ ప్రమోషన్స్ లో సంక్రాంతి సెలవుల అనంతరం పాల్గొంటానని అనుష్క వివరించింది. ప్రస్తుతం ఆమె బెంగుళూరులోని తన కుటుంబంతో కలిసి పొంగల్ సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేసుకుంటోంది.

నిశ్శబ్దం సినిమా విషయానికి వస్తే.. మాధవన్ ఒక సెలబ్రెటీ మ్యూజిషియన్ గా అంథోని అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కోన వెంకట్ నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషల్లో సినిమాను ఒకేసారి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఇక - అంజలి - హాలీవుడ్ యాక్టర్ మైకేల్ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.