Asianet News TeluguAsianet News Telugu

యాక్షన్ సీక్వెన్స్ చెత్తగా వచ్చింది, నిరాశలో స్టార్ హీరో!

తెలుగులో  ఓ స్టార్ హీరో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో నిర్మాతలు ఖర్చు కు వెనకాడకుండా నీళ్లలా ఖర్చుపెడుతున్నారు. అంతాబాగానే ఉంది. కానీ అందుకు తగ్గ అవుట్ ఫుట్ రాలేదని సదరు హీరో తలపట్టుకు కూర్చున్నారట. 

STAR hero DISAPPOINTED WITH ACTION SEQUENCE
Author
Hyderabad, First Published May 26, 2020, 9:43 AM IST

మన ఇండస్ట్రీలో హీరోలు ప్రతీ విషయం దగ్గరుండి చూసుకుంటారు. స్క్రిప్టు దగ్గర నుంచి సినిమాలో ఫైట్స్, పాటలు అన్ని తాము ఎక్సపెక్ట్ చేసిన రీతిలో ఉండాలనుకుంటారు. అందుకోసం డైరక్టర్ మీద, నిర్మాత మీద ప్రెజర్ తెస్తూంటారు. రాత్రికి రాత్రి ఏదో యూట్యూబ్ ఛానెల్ లో ఓ సీన్ చూసి ..తెల్లారి తన సినిమాలో అలాంటిది పెట్టమంటూ పట్టుబట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవి సినిమా కథలో సింక్ అవుతాయో కూడా వాళ్లకు అనవసరం. అలాగే  తెలుగులో  ఓ స్టార్ హీరో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో నిర్మాతలు ఖర్చు కు వెనకాడకుండా నీళ్లలా ఖర్చుపెడుతున్నారు. అంతాబాగానే ఉంది. కానీ అందుకు తగ్గ అవుట్ ఫుట్ రాలేదని సదరు హీరో తలపట్టుకు కూర్చున్నారట. 

లాక్ డౌన్ కు ముందు షూట్ చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్ పై తెగ ఖర్చు పెట్టారట నిర్మాతలు. దాదాపు ఒక కోటి దాకా ఫైట్ కే ఖర్చు పెట్టారట. కానీ ఇప్పుడు ఆ అవుట్ ఫుట్ చూసుకుంటే చాలా డల్ గా ఉందిట. షూట్ చేస్తున్నప్పుడు అదిరిపోయిందనిపించిన ఆ ఎపిసోడ్ ..ఎడిటింగ్ అయ్యేసరికి దారుణంగా అనిపించిందట. హీరో కావాలని డిజైన్ చేయించుకున్న ఎపిసోడ్ అదిట. దాంతో దర్శకుడుకు ఏ ప్రమోయం లేదు. నిర్మాత ఆ ఎపిసోడ్ ని ఏదన్నా అంటే హీరో అలిగుతాడని భయం. దాంతో తమకు నచ్చిందని , హీరోకు నచ్చ చెప్తున్నారట. కానీ హీరో తానే ఆ ఖర్చు భరిస్తానని, లాకౌ డౌన్ ఎత్తేసాక, ఆ ఎపిసోడ్ మళ్లీ షూట్ చేద్దామని అంటున్నాడట. 

అసలే లాక్ డౌన్ దెబ్బతో షూటింగ్ లు లేటు అవుతన్నాయి. ఇలా రీషూట్ పోగ్రామ్ లు పెట్టుకుంటే ఎప్పటికి తమ సినిమా పూర్తి అవుతుందని నిర్మాత వాపోతున్నాడట. హీరో మాత్రం ససేమిరా ఒప్పుకోవటం లేదట. మళ్లీ దాన్ని వేరే రకంగా ఎడిటింగ్ చేసి చూద్దామని, ఎడిట్ లో లాగ్ లు వచ్చాయని దర్శకుడు సైతం నచ్చ చెప్తున్నట్లు సమాచారం. ఫైనల్ గా రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. సినిమాకు అదే కీలకం అని, ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీక్వన్స్ అని , వేరే చోట అయితే కొద్దిగా ట్రిమ్ చేసి వదిలేద్దమని హీరోగారి వాదనట. 

Follow Us:
Download App:
  • android
  • ios