కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ యాక్సిడెంట్ కి గురయ్యారు. షూటింగ్ లో భాగంగా ఒక యాక్షన్ సన్నివేశంలో బైక్ నడుపుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. వెంటనే అలెర్ట్ అయిన చిత్ర యూనిట్ అజిత్ కి షూటింగ్ స్పాట్ లోనే ట్రీట్మెంట్ ఇప్పించారు. అయితే తన వల్ల షూటింగ్ ఆగిపోకూడదని అజిత్  దెబ్బలు తగిలినా లెక్క చేయకుండా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ పూర్తి చేశారు.

బోణి కపూర్ ప్రొడక్షన్ లో వినోథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో అజిత్ రేసర్ గా కనిపించనున్నాడు. అయితే షూటింగ్ లో బైక్ అదుపు తప్పడంతో అజిత్ కిందపడినట్లు చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. గాయాలు పెద్దవి కాకపోవడంతో అజిత్ వెంటనే కోలుకొని షూటింగ్ తో మళ్ళీ బిజీ అయినట్లు చెప్పారు. ఖైదీ - నెర్కొండ (పింక్ రీమేక్) సినిమాల అనంతరం దర్శకుడు వినోథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలొకొన్నాయి.

పైగా శ్రేదేవి భర్త బోణి కపూర్ సినిమాను నిర్మస్తుండడం కోలీవుడ్ లో మంచి క్రేజ్ అందుకుంటోంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ధర ఇప్పటికే 150కోట్లు దాటినట్లు సమాచారం. సినిమాలో అభిమానులకు నచ్చే మాస్ ఏలిమెంట్స్ తో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయట. మరీ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.