నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “భీష్మ “.  ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. అందులో భాగంగా ఈ నెల 17న అంటే రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుతున్నారు. హైదరాబాద్ యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు.  ఆ బ్యానర్ తో తనకున్న అనుబంధం, నితిన్ తో ఉన్న స్నేహంతో త్రివిక్రమ్ ఈ ఈవెంట్ కు వస్తున్నట్లు సమాచారం.  “భీష్మ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ పోస్టర్, సింగిల్స్ యాంథమ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మాస్‌, క్లాస్‌, లవ్‌‌, రొమాన్స్‌ షేడ్స్‌ కనిపించేలా విడుదల చేసిన టీజర్, సాంగ్స్ ఇప్పటికే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్‌ రష్మిక మరోసారి కుర్రకారును పిచ్చెక్కించడం ఖాయమని వినపడుతోంది. అఆ తర్వాత భీష్మతో నితిన్‌ సూపర్‌ హిట్‌ అందుకోవడం ఖాయమని ట్రేడ్ అంచనా వేస్తోంది.   సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సింగిల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో  వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. రాజీవ్ కనకాల, అనంత నాగ్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

‘అఆ’ తర్వాత ఈ యంగ్‌ హీరో నితిన్‌కు సరైన విజయాలు లేవు.  'లై', 'ఛల్ మోహన రంగ', 'శ్రీనివాస కళ్యాణం' వంటి వైవిధ్య కథాంశాలతో నితిన్‌ తీసిన సినిమాలు కమర్షియల్‌గా హిట్‌ సాధించలేకపోయాయి. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చి, నితిన్‌ వరుస  సినిమాలతో దూకుడు పెంచాడు.

‘భీష్మ’ షూటింగ్‌ జరుగుతుండగానే 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' సినిమా షూటింగ్‌ విజయదశమి రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో కీర్తి సురేష్‌ నితిన్‌ సరసన ఆడిపాడనుంది.ఇక కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న చంద్రశేఖర్ ఏలేటితో కూడా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు నితిన్‌. భవ్య క్రియేషన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా వారియర్‌  హీరోయిన్. అంతేకాకుండా తమిళంలో ధనుష్ నటించిన 'వాడ చెన్నై' సినిమాని పవర్ పేట పేరిట మరో సినిమాని చేయనున్నట్లు సమాచారం.