ఫిబ్రవరి 15 నుంచి బోయపాటి,బాలయ్య చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతోంది. 2019లో వరసపెట్టి మూడు డిజాస్టర్స్ ఇచ్చిన బాలయ్య ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. బోయపాటి పరిస్దితి కూడా కొంచెం అటూ ఇటూలో అదే. 'వినయ విధేయ రామ' చిత్రం డిజాస్టర్ అవటం,విమర్శలు రావటంతో ఎలాగైనా రోరింగ్ హిట్ ఇచ్చి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఈ సినిమాలో హీరో, విలన్ పాత్రలను సరికొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం. బాలయ్యను అఘోరా బాబా గా చూపిస్తూ ప్రాజెక్టుపై ఆసక్తి రేపే ప్రయత్నం చేస్తున్నారు.బాలయ్యకు సమ జోడిగా ఉండే విలన్స్ కూడా రకరకాల ఆప్షన్స్ చూసిన బోయపాటి...స్టార్ కమిడియన్ నుంచి హీరోగా మారి ...రీసెంట్ గా విలన్ పాత్ర వేసిన సునీల్ దగ్గర ఆగినట్లు సమాచారం.

కమెడియన్స్ ..హీరోలుగా సెట్ అవటం కష్టమే అని తేలాక విలన్స్ అవతారమెత్తుతున్నట్లుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ చూడని సునీల్ ..ఈ సారి విలన్ గా టర్న్ అయ్యారు. రీసెంట్ గా వచ్చిన డిస్కోరాజా చిత్రంలో విలన్ గా నెగిటివ్ పాత్రలో కనిపించిన సునీల్ కు సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మంచి అప్లాజ్ వచ్చింది. అతని క్యారక్టర్ ఇచ్చే ట్విస్ట్ .. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

క్లీవేజ్ సొగసులతో కుర్రాళ్ల ప్రాణం తీస్తోన్న పూజాహెగ్డే!

సునీల్ లో మరో యాంగిల్ ఉందని అందరూ మెచ్చేసుకున్నారు. ఇది దర్శకుడు బోయపాటిని ఇంప్రెస్ చేసింది. తన సినిమాలో విలన్స్.. కాస్త విభిన్నంగా ఉండాలని కోరుకునే ఆయన ...ఈ సారి బాలయ్యతో చేసే చిత్రంలో సునీల్ కు విలన్ పాత్ర ఇచ్చినట్లు వినపడుతోంది. అంతేకాదు హీరో నుంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిన శ్రీకాంత్ సైతం ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నారు.

‘నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ను బాలయ్య చెప్తూ తన కొత్త సినిమాని రీసెంట్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే.‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలతో సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌గా పేరుపొందిన బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్‌ చిత్రం పూజ జరిగింది.

NBK106గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం  షూటింగ్ ఏప్రియల్ 22 వ తేదీకి పూర్తి చేసి, మే 21న సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమాని రిలీజ్ చేయటానికి సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలు వచ్చాయి. ఈ రెండూ మంచి విజయం సాధించాయి. దీంతో బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌ సూపర్‌హిట్‌ అనే మార్క్‌ ఏర్పడింది. ఈ మేరకు మరో హిట్‌ కొట్టాలని బోయపాటి స్క్రిప్టును సిద్ధం చేసారట. ఇంట్రస్టింగ్ కథను రెడీ చేసారని చెప్తున్నారు. ఈ సినిమా ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో హిట్ కొడితే బోయపాటి-బాలయ్య హ్యాట్రిక్‌ కొట్టినట్లే. మరి వీరి కాంబినేషన్ లో వచ్చే ఈ కొత్త సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.