మోడల్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి అనంతరం సీరియల్స్ లో ఒక వెలుగు వెలిగిన వర్ధమాన నటి రహస్యంగా వివాహం చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో సీక్రెట్ మ్యారేజెస్ సంఖ్య ఎక్కువవుతోంది. ఆ లిస్ట్ లో సీరియల్ నటి కూడా ఉండడం నార్త్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ షోతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దివ్య భట్నాగర్ పై ప్రస్తుతం మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఆమె రహస్యం వివాహం చేసుకోవడంతో అందుకు గల కారణాలపై ఎన్నో రకాల పుకార్లు వెలువడుతున్నాయి. అయితే రూమర్స్ డోస్ ఎక్కువవ్వకూడదనే దివ్య సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

WE DID ❤️❤️

A post shared by Divya Bhatnagar (@divyabhatnagarofficial) on Dec 22, 2019 at 8:35pm PST

గత కోనేళ్ళుగా గగన్ తో ప్రేమలో ఉన్న దివ్య ఫైనల్ గా అతనితో మూడు ముళ్ళు వేయించుకున్నట్లు చెప్పేసింది.  వీరి కులాలు వేర్వేరు కావడంతో ఇరు కుటుంబంలోని పెద్దలు పెళ్లికి నీరాకరించారు. దీంతో ఈ ప్రేమ జంట సీక్రెట్ గా ఇరు కుటుంబాల సాంప్రదాయాలను గౌరవించి ట్రెడిషినల్ గా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

2015 నుంచి దివ్య గగన్ తో ప్రేమలో ఉంది. ఆ మధ్య వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో క్యాన్సిల్ అయినట్లు తెలిసింది. ఇక ఫైనల్ గా ఈ ప్రేమ జంట రూమర్స్ కి చెక్ పెట్టి సొంత నిర్ణయంతో గురు ద్వార్ లో అతికొద్ది మంది స్నేహితుల మధ్య రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Blessed 🙏

A post shared by Divya Bhatnagar (@divyabhatnagarofficial) on Dec 23, 2019 at 8:26am PST