దాదాపు మూడేళ్లుగా శృతి హాసన్ వెండితెరకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇన్నాళ్లూ తన లాంగ్ టైమ్ బోయ్ ఫ్రెండ్ మైఖల్ తో ఆమె గడుపుతూ సిని జీవితానికి దూరమైంది. అయితే ఈ ఏప్రియల్ లో ఆమె బ్రేకప్ తీసుకుంది. ఆ డిప్రెషన్ నుంచి ఇప్పుడిప్పుడే బయిటపడుతోంది. ఈ క్రమంలో ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంది. అందుకోసం తనకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ నే ఎంచుకుంది.

తెలుగులో రవితేజ సరసన ఆమె గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం కమిటైంది. అయితే అప్పుడున్నంత ఛామ్ ఆమెలో లేదు. ఆ క్రేజ్ లేదు. డిమాండ్ అసలు లేదు. దాంతో ఆమె రెమ్యునేషన్ బాగా తగ్గించి ఇచ్చారని సమాచారం. గతంలో రెండు కోట్లకు పైగానే రెమ్యునేషన్ డిమాండ్ చేసి తీసుకున్న ఆమె ఇప్పుడు అందులో సగం కూడా తీసుకోలేని పరిస్దితి. కోటి రూపాయలు డిమాండ్ చేస్తే కేవలం 75 లక్షలు మాత్రమే ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మళ్లీ తను మొదటి నుంచి మొదలుపెడుతున్నట్లే అని, తిరిగి ఫామ్ లోకి వచ్చాక రెమ్యునేషన్ తను అనుకున్నంత తీసుకుంటాను అంటోంది.

ఇదిలా ఉంటే ఈ భామ రీసెంట్ గా ఓ టాక్‌ షోలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ డిజిటల్‌ ప్లాట్‌ ఫాం కోసం మంచు లక్ష్మీ చేస్తున్న టాక్‌ షో ఫీట్ అప్‌ విత్‌ స్టార్స్‌. తారల బెడ్‌ టైం స్టోరీస్‌ పేరుతో ప్రమోట్ చేసిన ఈ షో వూట్స్‌ లో ప్రసారమవుతోంది. ఈ షో  శృతి హాసన్‌ సందడి చేసింది. ఈ సందర్భంగా తన కెరీర్‌, లవ్‌ లైఫ్‌తో పాటు తన పర్సనల్‌ అలవాట్లకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శృతి. గతంలో తాను  గతంలో తాను విస్కీ తాగేదాన్నని  ,ఆ అలవాటును మానుకున్నానని తెలిపింది. అయితే సడన్‌గా ఆల్కహాల్‌ మానేయటంతో తన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నట్టుగా తెలిపింది.