పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండల ‘లైగర్’ దారుణంగా చతికిల పడిన సంగతి తెలసిందే. సినిమా చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేశారు.
విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా రూపొందిన తాజా చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. రమ్యకృష్ణ, మైక్ టైసన్, మకరంద్ దేశ్ పాండే, అలీ వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది.
రిలీజైన మార్నింగ్ షో నుంచి సినిమాకు డిజాస్టర్ టాక్ వస్తోంది. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో మాత్రం సినిమా మీద పెద్ద ఎత్తున నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అంతేకాక ట్రోలర్లు కూడా ట్రోల్స్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ నెగెటివ్ హైప్ క్రియేట్ అయ్యింది. విజయ్ ఫ్యాన్స్ అయితే తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే నిన్నటి నుంచి షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్ తగులుకున్నారు. విజయ్ దేవరకొండను ఓ రేంజిలో ఆడుకుంటున్నారు. అందుకు కారణం ..షారూఖ్ పై గతంలో విజయ్ చేసిన కామెంట్...
ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా దేవరకొండ మాట్లాడుతూ...జీక్యూకి SRK ఇచ్చిన ఇంటర్వ్యూను గుర్తుచేసుకున్నాడు. స్టార్లలో నేను చివరివాడిని అన్న షారూఖ్ మాట నిజం కాదని అతనికి చెప్పాలని అనుకున్నాడంట. విజయ్ GQకి ఇచ్చిన ఇంటర్వ్యూలో , ‘షారూఖ్, నువ్వు తప్పు చేశావు. నువ్వు చివరివాడివి కావు. నేను వస్తున్నానని చెప్పాలనుకున్నాను. ఆమాట వెనుకున్న తన లైఫ్ స్టోరీ కూడా చెప్పాడు. “షారుఖ్ ఖాన్ విజయం నన్ను ఎంతగా నడిపిందో నేను మీకు చెప్పలేను. అతను ఇంత చేయగలిగితే నేను ఎందుకు చేయలేను?.
విజయ్ దేవరకొండ ఇటీవల ఇండియా టుడేతో ఇంటరాక్షన్‌లో షారూఖ్ నుండి ‘కింగ్’ టైటిల్‌ను కొట్టేయాలనుకుంటున్నానని అన్నాడు. నువ్వు ఖాన్ నుండి దొంగిలించాలనుకుంటున్నావని అడిగితే, ‘కింగ్ టైటిల్’ అని రెస్పాన్స్ ఇచ్చాడు. అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ లో అన్నమాటలు గుర్తు చేస్తూ చిత్రం కలెక్షన్స్ చూపిస్తూ షారూఖ్ ని నువ్వు తప్పు చేసావు అనేటంత గొప్పవాడివా అని నిలదీస్తున్నారు. టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.
