కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన నటి శ్రీరెడ్డి ఇండస్ట్రీకి చెందిన స్టార్లపై ఆరోపణలు చేసింది. దర్శకులు, నటులు, నిర్మాతలు ఇలా ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. తనకు అన్ని విషయాలు తెలుసునంటూ రెచ్చిపోతుంది.

బుధవారం నాడు తన సోషల్ మీడియా అకౌంట్ లో దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఒక నటితో ఎఫైర్ ఉందంటూ ఆ నటిపై దారుణ కామెంట్స్ చేసింది. సదరు నటి భర్తను సైతం వదలకుండా ఫోటోలతో సహా తన సోషల్ మీడియాలో షేర్ చేసి వివాదానికి తెర లేపింది.

ఇప్పుడు అదే నటి భర్తతో రోజాకి ఎఫైర్ ఉందంటూ పెద్ద పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఇందులో రోజా క్యారెక్టర్ ని తక్కువ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది. రోజాకి నటి ప్రవీణ భర్త అనీల్ తో ఎఫైర్ ఉండేదని.. డబ్బుల కోసం రోజా అతడిని గోకేదని.. డబ్బున్న వాళ్లను పరిచయం చేయమని అనీల్ ని అడిగేదని ఇలా ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

'రోజా గారు మీరు వైసీపీలో ఉన్నందుకు నా పూర్తి మద్దతు, మిమ్మల్ని కించపరచాలని కాదు.. మీకు నిజం చెప్పాలనేదే నా ప్రయత్నం.. మీ రచ్చబండ లేదా బతుకు జట్కా బండికి వాళ్లను పిలవండి. నేనూ కూడా వస్తా' అంటూ వరుస పోస్ట్ లు పెట్టింది శ్రీరెడ్డి. రోజాపై ఇలాంటి ఆరోపణలు చేయడం శ్రీరెడ్డికి కొత్తేమీ కాదు.. గతంలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూ అప్పుడు కూడా రొజాని టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేసింది.