ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన 'మా' డైరీ ఆవిష్కరణలో రాజశేఖర్ కి, చిరంజీవికి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తరువాత రాజశేఖర్ తన వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటన తరువాత 'మా'లో క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.

దీనిపై తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించారు. క్రమశిక్షణా కమిటీ పెట్టాలని చిరంజీవి పిలుపు ఇచ్చారని కానీ అసలు చర్యలు తీసుకోవాల్సింది అతడిపైనే అని శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా'లో మెగాఫ్యామిలీ ఆడిందే ఆట పాడిందే పాట అయిపోతుందని.. ఏ ఫంక్షన్ లోనైనా.. చిరు, మోహన్ బాబు, నాగార్జున. సుబ్బిరామిరెడ్డి తప్ప చిన్న ఆర్టిస్ట్ లు ఎక్కడా కనిపించరని కామెంట్స్ చేసింది.

స్టార్ హీరోలకు బజ్ ఇస్తున్న ముదురు భామలు!

'మా' ఆర్టిస్ట్ లకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంలో రాజశేఖర్ చాలా జెన్యూన్ గా ఉంటారని.. ఈ విషయంలో ఆయనకి సపోర్ట్ చేస్తున్నానని.. కానీ జీవితకి మాత్రం తను మద్దతు తెలపనని చెప్పింది. చిరంజీవి మాట్లాడితే పెద్దరికం అంటారని.. ఆయన దృష్టిలో పెద్దరికమంటే జయప్రద, ఖుష్బూలతో ఈ వయసులో కూడా కుప్పిగంతులు వేయడమా..? అని ప్రశ్నించింది.

చిరంజీవికి ఎప్పుడూ పార్టీలు, డాన్స్ తప్ప మరో ఆలోచన ఉండదని.. మాలాంటి వాళ్లు మాట్లాడితే మాత్రం గొంతులు నొక్కేస్తారని ఆరోపణలు చేసింది. ఇక 'మా' కార్యక్రమంలో చిరంజీవి, మోహన్ బాబు ముద్దుల వెనుక అసలు రహస్యం ఇది అంటూ మరో స్టేట్మెంట్ ఇచ్చింది. 'మేమంతా కలిసే ఉన్నాం.. మేం కట్టిన ఈ గోడని ఎవరూ తాకలేరని చెప్పుకోవడానికి అందరి ముందు ఇలా ముద్దు పెట్టేసుకుంటున్నారని' చెప్పుకొచ్చింది.