మరోసారి విలన్‌గా మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు టాలీవుడ్ హీరో శ్రీకాంత్.  నెగిటివ్  పాత్రలతో సినిమా కెరీర్ ప్రారంభించిన శ్రీకాంత్ ఆ తర్వాత హీరోగా మారి ఓ తరానికి దగ్గరయ్యారు. ఆయన సినిమాలు ఫ్యామిలీలను  ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల తిరిగి విలన్ రోల్స్‌పై ఆసక్తి చూపిస్తున్నారు శ్రీకాంత్. ఆ మధ్యన నాగచైతన్య హీరోగా రూపొందిన 'యుద్ధం శరణం' చిత్రంలో మెయిన్ విలన్‌గా నటించాడు శ్రీకాంత్. అయితే ఆ సినిమాతో విలన్ గా బ్రేక్ రాలేదు.

దాంతో  మరోసారి విలన్‌గా కనిపించబోతున్నాడట ఈ మ్యాన్లీ హీరో. అయితే ఈ సారి విలన్ గా సెటిల్ అయిపోతానని చెప్తున్నాడట. అందుకు కారణం ఒకరే ..బోయపాటి శ్రీను.  తన సినిమాల్లో విలన్ పాత్రను స్పెషల్ గా డిజైన్ చేస్తూంటారు దర్శకుడు బోయపాటి. చాలా క్రూరంగా, దారుణంగా ఆయన పాత్రలు బిహేవ్ చేస్తూంటాయి. అదే స్దాయిలో ఆ పాత్ర లుక్ కూడా విభిన్నంగా ఉంటుంది.

హీరోలతో సమానంగా ఆ పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. లెజండ్ సినిమాలో జగపతిబాబుకు విలన్ గా పాత్ర ఇచ్చి కొత్త కెరీర్ ఇచ్చారు. ఆ క్యారక్టర్ ఎంత క్లిక్ అయ్యిందంటే ఇప్పటికీ పూర్తి స్దాయి బిజిగా ఉన్నారు జగపతిబాబు. ఇప్పుడు బోయపాటి దృష్టి శ్రీకాంత్ పై పడిందిట. బాలయ్య సినిమాలో నెగిటివ్ రోల్ కోసం అడిగారట. ఆ పాత్ర వినగానే శ్రీకాంత్ మారు మాట్లాడకుండా ఓకే చేసాడని వినికిడి. శ్రీకాంత్ లుక్ సైతం చాలా విభిన్నంగా ఉండబోతోందట. అందుకోసం శ్రీకాంత్ ...కష్టపడుతున్నారట. సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో మరో విలన్ గా కనిపించబోతున్నారు.

అందుతున్న సమాచారం మేరకు వీరిద్దరూ స్నేహితులుగా కనిపిస్తారట. మెయిన్ విలన్ సంజయ్ దత్  తో స్నేహం కోసం శ్రీకాంత్ ...బాలయ్యని ఎదిరిస్తాడట.  ఇక దర్శకుడు బోయపాటి, హీరో బాలకృష్ణ కాంబినేషన్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అంచనాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు ఘన విజయం సాధించి  భారీ వసూళ్లను రాబట్టాయి.

అప్పటికే చాలా ప్లాప్ లలో ఉన్న బాలకృష్ణకి కెరీర్ పరంగా మంచి  ఊపుని ఇచ్చాయి. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతూండటంతో అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో పట్టాలేక్కనుంది.     ఈ సినిమాలో హీరోయిన్ గా వేదిక నటిస్తుంటే, జబర్దస్త్ యాంకర్ రష్మి ఓ ప్రధాన పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు