2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో శ్రీదేవి అనుమానాస్పద స్థితిలో మరణించారు. అతిలోక సుందరిగా శ్రీదేవి ఇండియా మొత్తం తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. శ్రీదేవి అకాల మరణం చెందడంతో చిత్ర పరిశ్రమ తోపాటు అభిమానులు కూడా తీవ్ర విషాదానికి గురయ్యారు. 

గత ఫిబ్రవరి 24న కు శ్రీదేవి మరణించి రెండేళ్లు పూర్తయింది. ఇదిలా ఉండగా హిందూ సంప్రదాయాల ప్రకారం బోని కపూర్ ఫ్యామిలీ చెన్నైలో శ్రీదేవి ద్వితీయ వర్థంతి కార్యక్రమాలు నిర్వహించింది. శ్రీదేవి ద్వితీయ వర్థంతి కార్యక్రమాల్లో బోనికపూర్, జాన్వీ కపూర్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జాన్వీ కపూర్ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంది. జాన్వీ కపూర్ ట్రెడిషనల్ లుక్ లంగాఓణీలో మెరిసింది. స్నేహితులతో కలసి ఉన్న ఫోటోలని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Wish u were here

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Mar 4, 2020 at 2:02am PST

ఈ సందర్భంగా జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి గురించి ఎమోషనల్ కామెంట్ పెట్టింది. అమ్మ నువ్వు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నా అని జాన్వీ కామెంట్ పెట్టింది. జాన్వీ స్టార్ హీరోయిన్ గా రాణించాలనేది శ్రీదేవి కల. ప్రస్తుతం జాన్వీ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది.