‘శ్రీ ఓం సినిమా’ సమర్పణలో కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘తిప్పరా మీసం’. నవంబర్ 8న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలిపారు మేకర్స్. రీసెంట్ గా విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడంతో విడుదల తేదీని ప్రకటించారు చిత్రయూనిట్. అతి త్వరలోనే ట్రైలర్.. ఆడియో విడుదల వేడుక కూడా జరగనున్నాయి.

తిప్పరామీసం తెలుగు రాష్ఠ్రాల థియెట్రికల్ హక్కులను ఏసియన్ సినిమాస్ సునీల్ ఫ్యాన్సీ అమౌంట్ ఇచ్చి సొంతం చేసుకున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సిధ్ సినిమాటోగ్రఫీ అందించారు. నిక్కీ తంబోలి హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. తిప్పరామీసం సినిమాను రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ ఓం సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది. బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు ఈ మధ్యే మంచి విజయం అందుకోవడంతో తిప్పరామీసం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
 
  దర్శకుడు విజయ్ ఎల్ మాట్లాడుతూ.. ‘‘అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకేకథ చిత్రాల తరువాత ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామ్యం చేస్తూ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉంది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
 
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. "విజయ్ గారితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నాను. కొన్ని ఏళ్లుగా మేము కలిసి పనిచేస్తున్నాము. ఈ సినిమా అందరికి నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను" అన్నారు.
 
 రోహిణి, రఘుబాబు, అచ్చుత్ రామారావు, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి (డైరెక్టర్), అజయ్ ఘోష్, రవి వర్మ తదితరులు ఇతర నటీనటులు.