సోషల్ మీడియాలో ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు, దర్శకులు, నిర్మాతలపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసే శ్రీరెడ్డి ఈసారి ఏకంగా వైసీపీ యువ నాయకుడు సిద్ధార్థ్ రెడ్డిపై పోస్ట్ లు పెట్టింది. అతడికి ఒక్కరోజు పెళ్లాంగా ఉన్నా చాలని, ఆ తరువాత చనిపోయినా పరవాలేదని పోస్ట్ పెట్టింది. నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన సిద్దార్థ్ రెడ్డికి మంచి 
క్రేజ్ ఉంది.

రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. తన స్పీచ్ లతో యూత్ లో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

వైసీపీలో బైరెడ్డి బలమైన యువనాయకుడిగా మారారు. అటువంటి వ్యక్తిపై మనసు పారేసుకుంది శ్రీరెడ్డి. '‘బైరెడ్డి.. సిద్ధార్థ్ రెడ్డి నువ్ మాగాడివిరా బుజ్జీ’ అంటూ అతనికి కనీసం ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు అంటూ ఘాటు కామెంట్స్ చేసింది. తొలిసారి పెళ్లి గురించి పోస్ట్ పెడుతున్నానని.. సిద్ధార్థ్ రెడ్డికి భార్యగా ఉండాలనుందని చెప్పింది. ఈ పోస్ట్ చూసిన సిద్ధార్థ్ అభిమానులు 'దయచేసి మా నాయకుడ్ని వదిలేయ్' అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరికొందరు ఓసారి సిద్ధార్థ్ ని అడిగి చూడమని ఉచిత సలహాలు ఇచ్చారు. సిద్ధార్థ్ రెడ్డి దూకుడు వ్యవహారశైలి శ్రీరెడ్డిని ఆకర్షించినట్లుంది. అందుకే ఒక్కరోజైనా అతడికి భార్యగా ఉండాలనే తన కోరికను వెల్లడించింది.