టాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేసిన శ్రీరెడ్డి నటిగా ఎవరికీ పెద్దగా తెలియదు కానీ కాస్టింగ్ కౌచ్ విషయంలో మాత్రం ఆమె పేరు బాగా వినిపించింది. ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన, టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకులు ఇలా చాలా మందిపై సంచలన ఆరోపణలు వంటి విషయాలు శ్రీరెడ్డిని వార్తల్లో నిలిచేలా చేశాయి.

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పట్లో మర్చిపోలేం. కొన్నాళ్లపాటు టాలీవుడ్ ని టార్గెట్ చేసిన ఈమె ఆ తరువాత కోలీవుడ్ పై పడింది. సుందర్ సి, విశాల్ లాంటి ప్రముఖ వ్యక్తులపై ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. వీరంతా సరిపోలేదని అనుకుందో ఏమో ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ని టార్గెట్ చేసింది.

చాలా కాలంగా రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని అంటున్నారు కానీ ఇంకా ఆయన ఎంట్రీపై క్లారిటీ లేదు. మరోపక్క వరుసగా సినిమాలు సైన్ చేస్తున్నారు. చాలా మంది రజినీకాంత్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి సీరియస్ కామెంట్స్ చేసింది.

'రజినీకాంత్ గారు.. ఇదేమీ సినిమా కాదు సస్పెన్స్ మైంటైన్ చేయడానికి.. మీరు రాజకీయాల్లోకి వస్తారా..? రారా..? క్లారిటీ ఇవ్వండి' అంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు.. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే.. ఆయన పార్టీలో తను కూడా జాయిన్ అవుతానని మరో పోస్ట్ పెట్టింది.