బుల్లి తెర యాంకర్ శ్రీముఖి…నుంచి బిగ్ బాస్ రన్నర్ అప్ శ్రీముఖి గా ఎదిగిన ఆమె …ప్రస్తుతం మీడియాకు కనిపించడం లేదు. బిగ్ బూస్ పూర్తి అయ్యిన నాటి నుంచీ…శ్రీముఖి మాత్రం ఎవ్వరికీ అందుబాటులో లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో తనతో పాటు ఉన్నా చాలా మంది ఆమెను డిన్నర్ పార్టీకి పిలవాలి అని ప్లాన్ చేశారు…కానీ ఆమె సెల్ రీచ్ కాలేదు. ఇక టీవీ చానెళ్లు చాలా మంది ఆమెతో ఒక షో చెయ్యాలి అని ప్లాన్ చేసి ఎదురు చూస్తూ ఉన్నారు…కానీ ఆమె మాత్రం అందుబాటులో లేదు. ఎక్కడ ఉందీ..

బిగ్‌బాస్‌- 3 హౌజ్‌లో 105 రోజుల ప్రస్థానం  శ్రీముఖి ది. టైటిల్‌ గెలవకపోయినా... కోట్ల మంది హృదయాలను గెలిచానని చెబుతున్న శ్రీముఖి బిగ్‌బాస్‌ హౌజ్‌లో నుంచీ బయిటకు వచ్చాక రిలాక్స్ అవటం కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఫ్రెండ్స్,  ఫన్ తో ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాలోని పాటలతో స్టెప్స్ వేసి ఓ వీడియో వదిలింది. ఈ వీడియోలో యాంకర్ విష్ణు ప్రియను, రాజ్ చైతను కూడా చూడవచ్చు. శ్రీముఖి ఫుల్ ఎనర్జీగా ఉంది.  ఈ వీడియో ఆమె ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

శ్రీముఖి మాట్లాడుతూ... విశ్రాంతి కోసం మాల్దీవుల్లో. కొన్నిరోజులు కుటుంబంతో గడుపుతా. తరువాత ఎప్పటిలానే షోలు కొనసాగిస్తా. బిగ్‌బాస్‌ వల్ల నాలో కోపం చాలావరకూ తగ్గింది. ఓపిక పెరిగింది. ఛాలెంజ్ లను తీసుకునే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం బలపడ్డాయి. ప్రేక్షకుల అంచనాలను చేరుకునే పెద్ద బాధ్యత నాపై ఉంది. దాన్ని నేను నిర్వర్తిస్తా. బిగ్‌బాస్‌ జీవిత పాఠాలెన్నో నేర్పించింది. ఆ ఇంటి గుర్తుగా టాటూ నాతో పాటు చివరివరకూ ఉంటుంది. నా వ్యక్తిత్వాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ ప్రయాణం ఎంతగానో తోడ్పడింది అంటూ చెప్పుకొచ్చింది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreemukhi (@sreemukhi) on Nov 8, 2019 at 5:22am PST